నటి కరాటే కళ్యాణి మీద గత మూడు రోజులుగా వార్తలు వస్తున్నాయి. చిన్నపిల్లను వారి తల్లిదండ్రులనుంచి బలవంతంగా తీసుకువచ్చిందని సోషల్‌మీడియాలోనూ, య్యూబ్యూబ్ ఛానల్‌లో రావడంతో రచ్చ అయింది. పోలీసు కేసుకూడా అయింది. తాజాగా మంగళవారంనాడు కళ్యాని పోలీసులు, మీడియా ముందు ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. అక్కడ పిల్ల తల్లిదండ్రులతో విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పింది.
ఆమె మాటల్లోనే, నాకు పిల్లలు లేరు. ఆటో డ్రైవర్ దంపతులు వీరు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. ఆర్థికపరిస్థితి బాగోలేదు. కరోనా టైంలోనే నా గురించి తెలిసి సాయం చేస్తానని వచ్చారు. నేను ఇప్పుడు పెంచుకోను అన్నాను. ఏడాది తర్వాత మరలా వచ్చారు. నేను నెలల పిల్లతోపాటు వారి త ల్లిదండ్రులను మా ఇంటిలోనే పెట్టుకున్నాను. ఈ విషయం తెలీక ఎవడో ఒకడు పిల్లను కిడ్నాప్ చేసిందనీ, రకరకాలుగా వార్తలు రాశారు. ఆ వ్యక్తిపై నేను కేసు పెడతాను. ఇక మా అమ్మగారితోనూ నాకు సరిపడదు. ఆమె ఏవోవో అబద్ధాలు కూడా చెబుతుంది. మా నాన్నగారు చనిపోయారు. మా మామగారికి ఆరోగ్యంబాగోకపోతే నేను చూసుకుంటున్నాను. ఇంత మానవతా కోణంలో నేను సేవ చేస్తుంటే నాపై కొందరు పనిగట్టుకుని పుకార్లు పుట్టిస్తున్నాను. నా ఎదుగుదలను అడ్డుకుంటున్నారని వాపోయింది. ఏది ఏమైనా నాపై దుష్పచారం చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు.