Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'జిగేలు రాణి' పాట నా క్రేజ్‌ను అమాంతం పెంచేసింది : పూజా హెగ్డే

'జిగేలు రాణి' పాట నా క్రేజ్‌ను అమాంతం పెంచేసింది : పూజా హెగ్డే
, బుధవారం, 24 అక్టోబరు 2018 (10:59 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస ఆఫర్లను చేజిక్కించుకున్న హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. ఈమె నటించిన తొలి చిత్రం "దువ్వాడ జగన్నాథం". ఈ చిత్రం పెద్దగా ఆడకపోయినప్పటికీ.. ఆమె నాజూకుతనం, అందానికి టాలీవుడ్ డైరెక్టర్లతో పాటు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు, సినీ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఫలితంగా ఆమెకు వరుస ఆఫర్లు క్యూకడుతున్నాయి. 
 
ముఖ్యంగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' చిత్రంలోని 'జిగేల్ రాణి' పాట ఈ భామ క్రేజ్‌ను ఒక్కసారిగా పెంచేసింది. ఈ పాట ఐటమ్ సాంగ్ అయినప్పటికీ ఆమె ధైర్యం చేసిన నటించింది. ఫలితంగానే ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. 
 
దీనిపై పూజా హెగ్డే స్పందిస్తూ, నన్ను 'జిగేలు రాణి' చేయమని చెప్పినప్పుడు ముందుగా పాట విన్నాను. జానపద గీతం తరహాలో వున్న ఈ పాట నాకు బాగా నచ్చింది. ఈ పాట జనంలోకి బాగా వెళుతుందనీ .. సినిమాకి హైలైట్‌గా నిలుస్తుందని అనిపించింది. నాకు మంచి క్రేజ్ తెస్తుందని కూడా ఊహించాను. అందువల్లనే రెండో ఆలోచన లేకుండా ఈ పాట చేయడానికి అంగీకరించాను. ఈ పాట విషయంలో నేను ఏదైతే అనుకున్నానో.. అదే జరిగింది అంటూ చెప్పుకొచ్చిందీ జిగేల్ రాణి. 
 
కాగా, ప్రస్తుతం ఆమె నటించిన అరవింద సమేత వీరరాఘవ చిత్రం కూడా సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెల్సిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరెక్కిన ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోహన్ చేతుల్లో శ్రద్ధా నలిగిపోయిందా? ఫోటో చూస్తుంటే జ్ఞాపకానికి వస్తున్నాయి...