Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిజజీవితంలో విలన్‌ను కాదు.. సున్నితమైన భర్తగా నటించాలని ఉంది : జగపతిబాబు

Advertiesment
నిజజీవితంలో విలన్‌ను కాదు.. సున్నితమైన భర్తగా నటించాలని ఉంది : జగపతిబాబు
, ఆదివారం, 21 అక్టోబరు 2018 (16:42 IST)
30 యేళ్ళ నట ప్రయాణం హీరో జగపతిబాబుది. ఈ ప్రస్థానంలో ఎన్నో ఉత్థానపతనాలు చూశారు. 'కథానాయకుడిగా జగపతిబాబు పనైపోయింది' అనుకుంటున్న దశలో 'లెజెండ్' వచ్చింది. అది ఆయన జీవితాన్ని అనూహ్యమైన మలుపు తిప్పింది.
 
ప్రతినాయకుడిగా తానెంత విలువైన నటుడో ఆ సినిమాతో నిరూపితమైంది. అక్కడి నుంచి జగ్గూభాయ్‌కి చిత్ర సీమ ఎర్ర తివాచి పరిచింది. స్టార్‌ కథా నాయకుల చిత్రాల్లో ప్రతినాయకుడిగా నటిస్తూ, తనలోని విభిన్న కోణాల్ని ఆవిష్కరించుకుంటున్నారు. తాజాగా 'అరవింద సమేత వీర రాఘవ'లో బసిరెడ్డిగా ఆయన పాత్ర ప్రశంసలు అందుకుంటోంది. 
 
ఈ పాత్రపై ఆయన స్పందిస్తూ, 'రంగస్థలం'లో కన్నా క్రూరమైన పాత్ర చేశానని కొంతమంది అంటున్నారు. ఇలా వరుసగా విలన్‌ పాత్రలు చేస్తుండడంతో ప్రతి ఒక్కరూ తనను ఆ దృష్టితో చూస్తున్నారు. తాను సినిమాల్లోనే విలన్‌ని... నిజజీవితంలో కాదు. (నవ్వుతూ). నాకైతే అప్పుడప్పుడూ గాఢ్‌ఫాదర్‌ తరహా పాత్రలు చేయాలనివుంది. సున్నితమైన భర్తగానూ కనిపించాలనుంటుంది. అదీ నా వయసుకి తగ్గట్టుగానే అని వ్యాఖ్యానించారు. 
 
'బసిరెడ్డిగా రాయలసీమ యాసలో నేను చెప్పిన సంభాషణలూ, నటనా ఆ ప్రాంత వాసులకు బాగా పట్టేసింది. పెంచలదాసు రాయలసీమ యాసలో రాసిన సంభాషణలే ఈ పాత్రని ఇంతలా నిలబెట్టాయి. గొంతు పోయినా, రక్తం వచ్చేంత పనైనాసరే అనుకుని చాలా కష్టపడి డబ్బింగ్‌ చెప్పా. అందుకు తగిన ఫలితమే వచ్చింది' అని ఆయన చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ విషయం చెబితే హీరోలు హర్ట్ అవుతారు : కీర్తి సురేష్