Siddu Jonnalagadda, Madhu Shalini, Geet Saini, Shashi Kumar Thikka
ప్రముఖ నటి మధు శాలిని ప్రెజెంటర్‌గా రూరల్ లవ్ స్టొరీ "కన్యా కుమారి" చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. రాడికల్ పిక్చర్స్ బ్యానర్‌పై సృజన్ అట్టాడ రచన, దర్శకత్వం, నిర్మాతగా రూపొందించిన ఈ చిత్రంలో గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం ఆగస్టు 27న వినాయక చవితి సందర్భంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ, మధు ఒక సినిమాని ప్రజెంట్ చేస్తుందంటే తప్పకుండా అందులో కంటెంట్ ఉంటుంది. టీజర్ చూసిన వెంటనే ఈవెంట్ కి రావాలని అనుకున్నాను. ఈ సినిమా టీజర్ చూడగానే రైటింగ్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. టీజర్ లో వైబ్ వుంది. కచ్చితంగా బాగుంటుందనే ఫీలింగ్ కలిగింది. టీజర్ చాలా ఆర్గానిక్ గా అనిపించింది. శ్రీ చరణ్, గీత్ పెర్ఫార్మన్స్ చాలా ఆర్గానిక్ గా ఉంది. క్యారెక్టర్స్ లో ఒదిగిపోయారు. టీజర్ ట్రైలర్ చాలా నచ్చాయి. కచ్చితంగా ఇది చాలా మంచి సినిమా అవుతుందని నమ్మకం కలిగింది అని తెలిపారు.
డైరెక్టర్ శశి కుమార్ తిక్క మాట్లాడుతూ.. శాలినితో గూడచారి సినిమాకి వర్క్ చేసాం. తన కాలికి గాయమైనప్పటికీ కూడా యాక్షన్ సీక్వెన్స్ చేసింది. నిజంగా తన ఒక ఫైటర్. ఎన్ని వచ్చినా జీవితంలో ఫైట్ చేయాలనేది ఆమె దగ్గర నేర్చుకున్నాను. ట్రైలర్ నాకు చాలా నచ్చింది. శ్రీ చరణ్ చాలా అద్భుతంగా నటించాడు. గీత్ ఫైర్ బ్రాండ్ తన పాత్రలో అత్యద్భుతంగా పెర్ఫార్మన్స్ చేసింది. పర్ఫెక్ట్ మీటర్లు పెర్ఫార్మన్స్ ఉంది. ట్రైలర్ చూడగానే ఈ సినిమా ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుందనిపిచింది. చాలా హానెస్ట్ గా ఉంది. ఎక్కడ కల్మషం కనిపించలేదు. చాలా ఆర్గానిక్ గా ఉంది. ఈ సినిమాని థియేటర్ కి వెళ్లి టికెట్ కొని చూస్తాను అని తెలిపారు.
మూవీ ప్రజెంటర్ మధు శాలిని మాట్లాడుతూ, శ్రీ చరణ్ గీత్ వాళ్ళిద్దరు కూడా అక్కడే పుట్టి పెరిగినట్టు యాక్ట్ చేశారు. ఈ సినిమాకి సపోర్ట్ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు . బన్నీ వాసు గారు సపోర్ట్ తో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాము. ఆగస్టు 27న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. సృజన్ గారు అద్భుతమైన సినిమాని మన ముందుకు తీసుకొచ్చారు. తప్పకుండా ఈ సినిమాని థియేటర్స్ లో చూసి ఆస్వాదించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.