Madhu Shalini, Geet Saini, Srujan Attada
ప్రముఖ నటి మధు శాలిని ప్రెజెంటర్‌గా రూరల్ లవ్ స్టొరీ "కన్యా కుమారి" చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. రాడికల్ పిక్చర్స్ బ్యానర్‌పై సృజన్ అట్టాడ రచన, దర్శకత్వం, నిర్మాతగా రూపొందించిన ఈ చిత్రంలో గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం ఆగస్టు 27న వినాయక చవితి సందర్భంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా మధు షాలిని మాట్లాడుతూ, కన్యాకుమారి టీజర్ చూడగానే నాకు చాలా నచ్చేసింది. గీత్ చాలా అద్భుతమైన క్యారెక్టర్ లో చాలా అందంగా కనిపించారు. సృజన్ తీసిన పుస్తక విమానం సినిమా నాకు చానా నచ్చింది. అలాంటి కొత్త టాలెంట్ ని సపోర్ట్ చేయాలనిపించింది. మీ అందరూ కూడా సినిమాను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మా అమ్మ న్నాన ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత మా అమ్మ ఉన్నత విద్యల్ని అభ్యసించారు. ఒకరిని ఒకరు చాలా సపోర్ట్ చేసుకున్నారు. ఈ సినిమా చూసిన తర్వాత మా అమ్మానాన్న లవ్ స్టోరీ కూడా ఇలానే స్టార్ట్ అయ్యింటుందనిపించింది. ఇది ఈ సినిమాతో నా పర్సనల్ కనెక్షన్. సృజన్ చాలా కష్టపడి పాషన్ తో ఈ సినిమా చేశారు. ఈ సినిమాని బన్నీ వాసు గారికి చూపించబోతున్నాము. ఆయనకి నచ్చాలని కోరుకుంటున్నాము. ఆయన మాకు ఇచ్చిన ధైర్యం మర్చిపోలేము. ఈ సందర్భంగా ఆయనకి హృదయపూర్వక కృతజ్ఞతలు. వినాయక చవితి రోజు ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తుంది. మరిన్ని బ్యూటిఫుల్ ఫిలిమ్స్ తో మీ ముందుకు రావాలని ప్రయత్నిస్తున్నాను. మీ అందరికీ సపోర్ట్ కావాలి. థాంక్యు సో మచ్'
గీత్ షైని మాట్లాడుతూ, ఇది విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉండే యూనిక్ లవ్ స్టోరీ. వర్షం పడినప్పుడు వచ్చే మట్టి సువాసన అంతా స్వచ్ఛంగా ఉంటుంది. ఈ సినిమాచూసినప్పుడు కూడా మనసును హత్తుకునే అనుభూతిని ఇస్తుంది. ఇందులో కన్యాకుమారి లాంటి పాత్ర చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి రోల్ వచ్చినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. డైరెక్టర్ గారు అంత అద్భుతంగా ఈ క్యారెక్టర్ రాశారు. ఈ సినిమా చూశాక ఒక మంచి సినిమా చూసామని అనుభవితి ప్రేక్షకులకు రావాలని ఆ దేవున్ని కోరుకుంటున్నాను.
డైరెక్టర్ సృజన్ మాట్లాడుతూ, కన్యాకుమారి దర్శకుడిగా రెండో చిత్రం. ప్రొడ్యూసర్ గా నా మొదటి చిత్రం. ఈ సినిమా పంట పొలాల్లో గట్ల మీద పుట్టిన ఒక వైల్డ్ ప్లవర్ లాంటిది. కరోనా లాక్ డౌన్ సమయంలో శ్రీకాకుళంలో ఒక ఊరిలో ఉండిపోయాను. మార్నింగ్ వాక్ చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి మార్నింగ్ వాక్ చేస్తూ శ్రీకాకుళం వరకు నడిచి వెళ్ళేది. ఆ పక్కనే నలుగురు కుర్రాళ్ళు ఒక చెట్టు కింద కూర్చుని సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఈ విజువల్ నాకు చాలా నచ్చింది. అలాంటి మనుషులతో అక్కడే సినిమా చేయాలనిపించింది. అలాంటి సినిమా చేయాలంటే కథలో నటీనటులు ఒదిగిపోయేనట్లు ఉండాలి. అలాంటి నటులు ఈ సినిమాల్లో కుదిరారు. ఇందులో నటించిన నటీనటులందరూ ఆ యాసని సరిగ్గా పట్టుకున్నారు. నటీనటులందరినీ శ్రీకాకుళం తీసుకెళ్ళిపోయి ఆ ప్రాసెస్ లో తయారు చేసిన సినిమా ఇది. గీత్ అద్భుతంగా నటించింది. సినిమా అంతా పూర్తయిన తర్వాత ఇక్కడ కొంత మందికి చూపించాం. వాళ్ళందరూ కూడా చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు. అప్పుడు మరింత నమ్మకం వచ్చింది.