Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Anushka : అనుష్క శెట్టి ఫిల్మ్ ఘాటి సెకండ్ సింగిల్ దస్సోరా రిలీజ్

Advertiesment
Anushka Shetty, Vikram Prabhu

దేవీ

, గురువారం, 21 ఆగస్టు 2025 (10:01 IST)
Anushka Shetty, Vikram Prabhu
క్వీన్ అనుష్క శెట్టి మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా ఘాటి అద్భుతమైన ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలు నెక్స్ట్ లెవల్ కి చేరుకున్నాయి. విక్రమ్ ప్రభు మేల్ లీడ్ గా నటించిన ఈ చిత్రానికి విజనరీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. UV క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు.
 
మేకర్స్ ఇప్పుడు సినిమా సెకండ్ సింగిల్ దస్సోరాను రిలీజ్ చేశారు. సాగర్ నాగవెల్లి కంపోజ్ చేసిన ఈ సాంగ్ స్టార్ట్ అవగానే ఎనర్జీ, కల్చర్, వైబ్రెన్స్‌తో ఫుల్‌గా మూడ్ బూస్ట్ చేస్తుంది. ఘాటీల జీవన శైలిని, వారి కల్చర్‌ని ట్యూన్ అద్భుతంగా క్యాచ్ చేసింది.
 
ఈఎస్ మూర్తి రాసిన లిరిక్స్‌ ఘాటీల లైఫ్, వాళ్ల స్ట్రగుల్స్‌, పట్టుదలని రిఫ్లెక్ట్ చేశాయి. గీతా మాధురి, సాకేత్, శృతి రంజనీ పాడిన పవర్‌ఫుల్ వోకల్స్ ఈ పాటకి మరింత ఫీల్ ని యాడ్ చేశాయి  
 
విజువల్స్‌లో అనుష్క శెట్టి, విక్రం ప్రభు, ఇంకో ఘాటీల టీమ్ గంజా సీక్రెట్‌గా ట్రాన్స్‌పోర్ట్ చేస్తూ, పోలీసుల్ని తప్పించుకుంటున్న సీన్స్ చూపించారు. ఇది సినిమా నేరేటివ్ ఎంత హై-స్టేక్స్‌లో ఉంటుందో ప్రజెంట్ చేసింది. బిగ్  స్క్రీన్ మీద ఈ సాంగ్ ఇంకా బలంగా ఇంపాక్ట్ చేయబోతుంది.
 
టెక్నికల్‌గా కూడా సినిమా టాప్-నాచ్‌గా ఉంది. మనోజ్ రెడ్డి కటాసాని సినిమాటోగ్రఫీ, సీనియర్ ఆర్ట్ డైరెక్టర్ తోటతరణి అద్భుతమైన సెట్‌లు డిజైన్ చేశారు. సాయి మాధవ్ బుర్ర డైలాగ్స్ రాశారు. చాణక్య రెడ్డి తూర్పు, వెంకట్ ఎన్. స్వామి ఎడిటింగ్ చేశారు. యాక్షన్ సీక్వెన్స్‌లు రామ్ కృష్ణన్ మాస్టర్ కంపోజ్ చేశారు.
 
సెప్టెంబర్ 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కోసం సిద్ధమవుతోన్న ఘాటి, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా రిలీజ్ కానుంది. ఇప్పటికే భారీ అంచనాలు వున్న ఈ చిత్రం ఈ ఏడాది మోస్ట్ ఎవైటెడ్ రిలీజ్ లో ఒకటిగా నిలబడబోతోంది.
 
తారాగణం: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు, చైతన్య రావు, రవీంద్రన్ విజయ్, జగపతి బాబు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?