ఎన్.టి.ఆర్. జూనియర్ పై అనంతపురం అర్బన్ ఎం.ఎల్.. దగ్గబాటి ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దానిపై ఎన్.టి.ఆర్. ఫ్యాన్స్ గట్టిగా నిలదీస్తే, అది నేను అన్న మాటలు కావు. ఎవరో కావాలని అలా చేశారు. ఇది రాజకీయ కుట్రలో భాగమని చెప్పినా ఫ్యాన్స్ వినలేదు. దానితో ఎన్.టి.ఆర్. ఫ్యాన్స్ అంతా ఒక్కటై ఎ.పి.లో ప్రెస్ క్లబ్ లో మీట్ ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ అక్కడ పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. దాంతో హైదరాబాద్ వచ్చారు.
అసలేం జరిగిందనేది పెద్ద ప్రశ్నగా వుంది. ఇటీవలే వార్ 2 ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్.టి.ఆర్. అన్నమాటలు అప్పట్లో అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. సినిమా గురించి మాట్లాడుతూ, ఒక్కసారిగా నందమూరి తారకరామారావు (తాత)గారి ఆశీస్సులున్నంత వరకూ నన్నెవరూ ఏమీచేయలేరని స్టేట్ మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత కొంతకాలానికి ఎం.ఎల్..ఎ. దగ్గబాటి ప్రసాద్ మాటలు సోషల్ మీడియాలో వచ్చాయి. అసలు అక్కడ నుంచి ఎందుకు వచ్చిందనేది పెద్ద ప్రశ్నే.
నిన్న జరగాల్సిన ఎన్.టి.ఆర్. ఫ్యాన్స్ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ మీట్ నందమూరి జయక్రిష్ణ భార్య పద్మ మరణంతో వాయిదా వేసుకున్నారు. అందుకే నేడు బుధవారంనాడు పలు జిల్లాల నుంచి వచ్చిన ఫ్యాన్స్ ప్రెస్ మీట్ లో ఇలా తెలియజేశారు. ప్రసాద్ అన్న మాటలు మా అభిమాన నటుడినే కాదు. మమ్మల్ని బాధించాయి. ఆయన ఏం తప్పుచేశారని అలా అన్నారు. పైగా వారి అమ్మగారైన షాలినీ కూడా కొన్ని సందర్భాల్లో తిట్టారు. ఇలా ఎందుకు జరుగుతుంది అని ప్రశ్నించారు.
అన్నంతపురంలో ప్రెస్ ను కలవాలనుకున్నాం. కానీ అక్కడ చుట్టూ పోలీసులు కాపలా పెట్టేశారు. విజయవాడలో అనుకున్నాం. ప్రెస్ క్లబ్ దగ్గర పోలీసులను పెట్టారు. ఎ.పి.లో ఎక్కడా ట్రై చేసినా ఇదే పరిస్థితి. మా స్టేట్ లీడర్లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అందుకే హైదరాబాద్ కు వచ్చి మీడియా ముందుకు వచ్చాం.ఎన్.టి.ఆర్., కళ్యాణ్ రామ్ ను కలవాలను ప్రయత్నించాం. ఎన్.టి.ఆర్. ముంబైలో కళ్యాన్ రామ్ అమెరికాలో వున్నారు. అందుకే మీడియా ముందుకు వచ్చి మా నాయకుడికి అండగా నిలవాలని వచ్చామని పేర్కొన్నారు. మరి ప్రసాద్ అనే వ్యక్తి వివరణ ఇచ్చినా ఫ్యాన్స్ ఇలా చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి? అనేది సస్పన్స్ గా వుంది.