Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విశాల్ ఆరోగ్యానికి ఏమైందంటే? ఖుష్బూ వివరణ

Advertiesment
vishal

సెల్వి

, బుధవారం, 8 జనవరి 2025 (10:47 IST)
హీరో విశాల్ ఆరోగ్యంపై ప్రస్తుతం సర్వత్రా చర్చ మొదలైంది. విశాల్ 'మధ గజ రాజా' ఈవెంట్‌లో పాల్గొన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతని ఆరోగ్యంపై అభిమానులకు ఆందోళన కలిగించింది. ఫుటేజీలో, విశాల్ వణుకుతున్నట్లు కనిపించాడు.  విశాల్ జ్వరంతో బాధపడుతున్నాడని టీమ్ మొదట పేర్కొన్నప్పటికీ, అభిమానులు అతని ఆరోగ్య స్థితి గురించి ఆరా తీస్తూనే ఉన్నారు.

దీనిపై స్పందించిన సీనియర్ నటి ఖుష్బు విశాల్ పరిస్థితిపై క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీలో ఉన్నప్పుడు విశాల్‌కు జ్వరం వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో వివరించారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ, 11 ఏళ్ల ఆలస్యం తర్వాత విడుదలవుతున్న మధ గజ రాజా సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌కు హాజరు కావాలని నిర్ణయించుకున్నాడు.

"విశాల్‌కి 103 డిగ్రీల జ్వరం వచ్చింది. వణికిపోతున్నాడు" అని ఖుష్బు చెప్పారు. ఇంత అనారోగ్యంగా ఉన్నా ఎందుకు వచ్చావని అడిగినప్పుడు, 11 ఏళ్ల తర్వాత సినిమా విడుదలవుతోంది కాబట్టి ఈ ఈవెంట్‌ను మిస్ కాలేను అని విశాల్ తనతో చెప్పాడని ఆమె తెలిపారు. కార్యక్రమం ముగిసిన వెంటనే విశాల్‌ను ఆసుపత్రికి తరలించామని, ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడని ఖుష్బు వెల్లడించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె హామీ ఇచ్చారు. ఇంకా విశాల్ అంకితభావాన్ని కొనియాడారు.

విశాల్ చాలా టాలెంటెడ్ ఆర్టిస్ట్, అతని చాలా సినిమాలను నేను నిజంగా ఇష్టపడతాను" అని ఖుష్బూ చెప్పారు. ఖుష్బు భర్త సుందర్ సి దర్శకత్వం వహించిన మధ గజ రాజాలో విశాల్ ప్రధాన పాత్రలో నటించగా, వరలక్ష్మి శరత్‌కుమార్, అంజలి కథానాయికలుగా నటించారు. 11 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీలీలపై కన్నేసిన బాలీవుడ్ హీరోలు!!