తన ఫోటోలను చూసి షాకైన అదితి రావు హైదరీ

శనివారం, 18 మే 2019 (16:21 IST)
ఏదేని సమాచారం లేదా ఫోటో కావాలంటే ఖచ్చితంగా ప్రముఖ సెర్చింజన్ గూగుల్‌‌పై ఆధారపడాల్సిందే. అలాంటి గూగుల్ బాలీవుడ్ నటి అదితిరావు హైదరీకి తేరుకోలేనిషాకిచ్చింది. తన ఫోటోల కోసం అదితి రావు సెర్చ్ చేయగా, ఆమెకు దుస్తుల్లేని ఫోటోలు కనిపించాయి. వాటిని చూసిన అదితిరావు షాక్‌కు గురయ్యారు. 
 
ఈ విషయాన్ని స్వయంగా ఆమెగారే వెల్లడించారు. 2011లో 'యే సాలీ జిందగీ' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఆ సినిమాలో తన నటనకు మంచి పేరొచ్చింది. ఆ సమయంలోనే అదితి సరదాగా గూగుల్‌లో వెదికిందట. 
 
అప్పుడు సినిమాలో దుస్తుల్లేకుండా ఉన్న కొన్ని ఫోటోలు కనిపించడంతో షాక్ అయిందట. అంతేకాదు ఇకపై గూగుల్‌లో వెదకకూడదని నిర్ణయించుకుని అప్పటి నుంచి గూగుల్ జోలికెళ్లడం మానేసిందట. అదితి రావు హైదరీ తెలుగు చిత్రాల్లో కూడా నటించిన విషయం తెల్సిందే.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం నాగార్జున కోసమే శ్రీముఖి తప్పుకుందా?