హ్యటా్రిక్ కథానాయకుడు కార్తీ నటించిన సర్దార్ ఇటీవలే విడుదలైంది. మొదటినుంచి చెబుతున్నట్లుగానే దీపావళికి హిట్ కొట్టారు. దర్శకుడు పి.ఎస్.మిత్రన్ ఇంతకుముందు అభిమన్యుడు అనే చిత్రాన్ని తీసి తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. సెల్‌పోన్ టెక్నాలజీని ఏవిధంగా మిస్‌యూజ్ చేసి కోట్లు సంపాదించవ్చనే మాఫియాను కంట్రోల్ చేసే విధంగా సినిమా వుంది.
తాజాగా వాటర్ సమస్యను తీసుకుని సర్దార్ చేశాడు. తమిళనాడు ముఖ్యంగా చెన్నైలో వాటర్‌ను ప్రైవేటీకరణ చేయడం జరిగింది. ఈ పాయింట్‌తో మిత్రన్ కథ రాసుకుని ఫిక్షన్‌తో కార్తీతో చేశాడు. సర్దార్ తెలుగు, తమిళ భాషల్లో విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా తమిళ సక్సెస్‌ను దీపావళినాడు చిత్ర యూనిట్ చెన్నైలో ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సంప్రాదాయ దుస్తులతో కార్తీ హాజరయ్యారు.
సర్దార్ చిత్రంలో హ్యటా్రిక్ హీరోగా కార్తీ నిలిచాడు. తమిళ సినీ ప్రముఖ నటుడు కార్తీకి ఈ సంవత్సరం గోల్డెన్ ఇయర్.'విరుమాన్', 'పొన్నియిన్ సెల్వన్' మరియు ఇప్పుడు దీపావళికి విడుదలైన 'సర్దార్' భారీ విజయాన్ని సాధించాయి. ఈ దీపావళి సందర్భంగా 'సర్దార్' టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.ఇప్పుడు కార్తీ ఈ చిత్రానికి రెండవ భాగం చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.ఈ వార్తలను అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
ఆగస్ట్‌లో విడుదలైన విరుమాన్‌లో పల్లెటూరి వ్యక్తిగా కార్తీ రగ్గడ్ లుక్‌లో కనిపించాడు. ఆ తర్వాత దర్శకుడు మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్'లో వందీయతేవన్‌గా ముఖ్యమైన పాత్రను పోషించాడు. గూఢచారిగా హృదయాలను దోచుకున్నాడు. ఇప్పుడు ద్విపాత్రాభినయం చేశాడు. 'సర్దార్'లో తండ్రీకొడుకులు.నటుడు కార్తీ విభిన్నమైన పాత్రలు, విభిన్నమైన కథలను ఎంచుకుంటూ మనల్ని అలరిస్తున్నాడు.తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు.
నిర్మాత ఎస్.లక్ష్మణ్ కుమార్, దర్శకుడు పి.ఎస్.మిత్రన్, రెడ్ జెయింట్ మూవీస్ సేన్బగమూర్తి, సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్, సినిమాటోగ్రాఫర్ జార్జ్ సి.విలియమ్స్, ఎడిటర్ రూబన్, ఆర్ట్ డైరెక్టర్ కతీర్, స్టంట్ మాస్టర్ దిలీప్ సుబ్బురాయన్, డైలాగ్ రైటర్ పొన్ పార్థిబన్, స్పెషల్ మేకప్ ఆర్టిస్ట్ పట్టణంలో పాల్గొన్నారు.