Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనుష్క వంటివారు చేసే లేడీఓరియెంట్ `సుంద‌రి`తో ద‌క్క‌డం అదృష్టంః పూర్ణ‌

Advertiesment
అనుష్క వంటివారు చేసే లేడీఓరియెంట్ `సుంద‌రి`తో ద‌క్క‌డం అదృష్టంః పూర్ణ‌
, గురువారం, 4 ఫిబ్రవరి 2021 (19:22 IST)
Poorna, Arjun, Rizwan, Sundari
పూర్ణ, అర్జున్ అంబటి, రాకేందు మౌళి ప్రధాన పాత్రదారులుగా రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కళ్యాణ్ జి. గోగణ దర్శకత్వంలో యంగ్ డైనమిక్ ప్రొడ్యూసర్ రిజ్వాన్ నిర్మిస్తోన్న ప్రొడక్షన్ నంబర్-3 చిత్రం "సుందరి". ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని  "ఓ కలనే కంటూవుంటే' పాట మ్యూజిక్ శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటుంది. యువ సంగీత కెరటం సురేష్ బొబ్బిలి అద్భుతమైన మ్యూజిక్ కంపోజ్ చేశారు. కాగా "సుందరి" ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. 
 
హీరోయిన్ పూర్ణ మాట్లాడుతూ, ' చాలా రోజుల తర్వాత సుందరి లాంటి ఒక మంచి సినిమాలో యాక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. చాలా తక్కువ టైంలో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేశాం. హీరోయిన్ సెంట్రిక్ ఫిలిమ్స్ చేయడానికి నిర్మాతలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. పెద్ద హీరోయిన్స్‌తో మాత్రమే లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ చేస్తారు. అనుష్క చేసేది. అలాంటిది రిజ్వాన్ ముందుకు వచ్చి ఒక బ్యూటిఫుల్ స్టొరీతో ఈ మూవీ నిర్మించారు.

నాతో ఈ సినిమా తీసిన రిజ్వాన్, కళ్యాణ్ కి నా స్పెషల్ థాంక్స్. 16 ఏళ్ల సినీ కేరియర్లో "సుందరి"లో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేశాను. ఒక విలేజ్ డీసెంట్, ఇన్నోసెంట్ అమ్మాయి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.. అనేది మెయిన్ కథాంశం. నాకు ఈ క్యారెక్టర్ బాగా నచ్చింది. ప్రస్తుతం ఈ మోడరన్ యుగంలో చాలా మంది అమ్మాయిల లైఫ్ లో జరిగిన స్టోరీ ఇది. అర్జున్‌తో యాక్ట్ చేయడం చాలా కంఫర్ట్‌గా ఫీలయ్యాను. వెరీ నైస్ గై. మా కాంబినేషన్లో వచ్చే సీన్స్ సప్రయిజింగ్‌గా ఉంటాయి. క్లైమాక్స్‌లో ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటుంది. అది చాలా హైలెట్ అవుతుంది. రాకేందు మౌళి ఎక్స్‌లెంట్‌గా చేశాడు.. సినిమా రిలీజ్ కోసం చాలా ఎగ్జైట్‌గా వెయిట్ చేస్తున్నాను.. అన్నారు.
 
దర్శకుడు కళ్యాణ్ జి. గోగణ మాట్లాడుతూ.. ' నాకు మాస్ హీరో సెంట్రిక్ ఫిలిమ్స్ అంటే చాలా ఇష్టం. లాక్డౌన్ టైంలో ఏదైనా డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిల్మ్ చెయ్యాలని అనుకున్నాను. అప్పుడు లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ చేస్తే బాగుంటుందని డిసైడ్ అయ్యాను. అప్పుడు "సుందరి" సబ్జెక్ట్ రెడీ చేశాను. రిజ్వాన్ లైన్ వినగానే వెంటనే ఇమీడియట్ గా షూటింగ్ స్టార్ట్ చేద్దాం అన్నారు. ఒక చిన్న థ్రెడ్ మీద సినిమా అంతా రన్ అవుతుంది. అది చెప్పడంకంటే స్క్రీన్ పైన చూస్తేనే అర్ధం అవుతుంది.

సురేష్ బొబ్బిలి ఎక్స్ట్రార్డినరీ ట్యూన్స్ ఇచ్చారు.. తన రీ-రికార్డింగ్ తో సినిమాని నెక్స్ట్ లెవెల్స్‌కి తీసుకెళ్లాడు. బాల్ రెడ్డి తన కెమెరా మ్యాజిక్ తో, క్వాలిటీ మిస్ అవకుండా ప్రతీ ఫ్రెమ్ ని అందంగా తీర్చిదిద్దాడు. ఎడిటర్ మణికాంత్ చాలా బాగా ఎడిట్ చేసి మంచి సపోర్ట్ చేసాడు. అలాగే లైన్ ప్రొడ్యూసర్  శ్రీవల్లీ నా స్ట్రేస్ అంతా తను తీసుకొని సెట్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా షూటింగ్ సాఫీగా జరిగేలా చూసుకున్నాడు. ఫైనల్‌గా మా సుందరి పూర్ణ గారు ఔట్‌స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ చేశారు` అన్నారు.
 
చిత్ర నిర్మాత రిజ్వాన్ మాట్లాడుతూ.. ' మా సుందరి ట్రైలర్ మీడియా వాళ్ళు రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. కళ్యాణ్ కథ చెప్పగానే ఇమీడియట్ గా ఒకే చెప్పేసాను. షూటింగ్ అంతా చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేశాం. సుందరి క్యారెక్టర్లో పూర్ణ అద్భుతంగా నటించింది. ఈ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ యాప్ట్ అయింది.  ప్రతీ సీన్ సింగిల్ టేక్ లో చేసి మా యూనిట్ అందర్నీ ఆశ్చర్య పరిచింది. అర్జున్ చాలా బాగా నటించాడు. ఇద్దరూ వారి పాత్రలకు ప్రాణం పోశారు. సురేష్ బొబ్బిలి మ్యూజిక్, బాల్ రెడ్డి ఫోటోగ్రఫీ, మా సినిమాకి హైలెట్ గా నిలుస్తాయి. కళ్యాణ్ కథ చెప్పిన దానికన్నా బ్రహ్మాండంగా సినిమాని తెరకెక్కించాడు. సినిమా చూసుకున్నాం.. మా అందరికీ బాగా నచ్చింది. ప్రేక్షకులకు కూడా తప్పకుండా నచ్చుతుందని నమ్మకంగా ఉంది.. అన్నారు.
 
webdunia
Arjun Amabti, Poorna
హీరో అర్జున్ అంబటి మాట్లాడుతూ.. ' ఏ డైరెక్టరైనా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వర్క్ చేస్తారు.. మా కళ్యాణ్ తనకి ఎలా కావాలో అలా సీన్ చెప్పి స్పాంటేనీయస్ గా  సీన్ చిత్రీకరిస్తాడు. రిజ్వాన్ మరిన్ని మంచి సినిమాలు నిర్మించి మాలాంటి వారికి ఎన్నో అవకాశాలు ఇవ్వాలి. సెట్లో పూర్ణ పెర్ఫార్మెన్స్ చూసి అందరం షాక్ అయ్యేవాళ్ళం. వెరీ హార్డ్ వర్కింగ్, డౌన్ టు ఎర్త్ పర్సన్. ఈ చిత్రంలో తన విశ్వరూపం చూస్తారు.. అంత బాగా నటించింది. సుందరి మూవీ సక్సెస్ అయి మాకు మంచి బ్రేక్ నిస్తుందని ఆశిస్తున్నాను.. అన్నారు.
 
కో-ప్రొడ్యూసర్ ఖుషీ మాట్లాడుతూ.. ' సుందరి ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తూంది. సినిమా చూశాను. చాలా బాగుంది. అవును తర్వాత పూర్ణ నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ చేసింది. అర్జున్ పెంటాస్టిక్ గా యాక్ట్ చేశాడు. కళ్యాణ్ లాస్ట్ టు ఇయర్స్ గా మాతో ట్రావెల్ అవుతున్నాడు.. ఒక మంచి సినిమా మా బ్యానర్లో చేశాడు. అలాగే మా బ్రదర్ రిజ్వాన్ మూడేళ్ళుగా ఇండస్ట్రీలో వుంటూ సినిమాలు తీస్తున్నాడు. ఈ సినిమా సక్సెస్ అయి అన్నయ్య మరిన్ని మంచి మూవీస్ నిర్మించాలని కోరుకుంటున్నాను. మా టీమ్ అందరూ చాలా హార్డ్ వర్క్ చేసి మాకు సహకరించారు.. వారందరికీ చాలా థాంక్స్..  అన్నారు.
 
లైన్ ప్రొడ్యూసర్ శ్రీ వల్లీ చైతన్య మాట్లాడుతూ.. ' లాక్డౌన్ టైంలో ఈ సినిమా షూటింగ్ జరిపామ్. మా నిర్మాత రిజ్వాన్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరికీ ఎంతో హెల్ప్ చేస్తూ.. సపోర్ట్ చేశారు. కళ్యాణ్ అన్న అత్యద్భుతంగా సుందరి చిత్రాన్ని రూపొందించాడు. సినిమా చాలా బాగా వచ్చింది. అందరూ ఈ సినిమాని ఆదరించి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను.. అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంచి క‌థ‌ ఎస్.ఆర్. కల్యాణమండపం: తరుణ్ భాస్కర్