Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రానా తమ్ముడు అభిరామ్‌ ఫోన్ దొంగిలించి... ఆ ఫోటోలు, వీడియో బయటపెడ్తామని వార్నింగ్...

ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కుమారుడు అభిరామ్‌కు బెదిరింపులు వ‌చ్చాయ‌నే విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే... అతడి సెల్‌ఫోన్‌ను తస్కరించిన నలుగురు దుండగులు అందులో ఉన్న ‘ఆ ఫొటోలు’ బయటపెడతామంటూ బ్లాక్‌‍మెయిలింగ్‌క

రానా తమ్ముడు అభిరామ్‌ ఫోన్ దొంగిలించి... ఆ ఫోటోలు, వీడియో బయటపెడ్తామని వార్నింగ్...
, గురువారం, 10 మే 2018 (12:58 IST)
ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కుమారుడు అభిరామ్‌కు బెదిరింపులు వ‌చ్చాయ‌నే విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే... అతడి సెల్‌ఫోన్‌ను తస్కరించిన నలుగురు దుండగులు అందులో ఉన్న ‘ఆ ఫొటోలు’ బయటపెడతామంటూ బ్లాక్‌‍మెయిలింగ్‌కు దిగారు. అవి బయటపెట్టకుండా ఉండాలంటే రూ.1.5 కోట్లు చెల్లించాలంటూ ఈ–మెయిల్‌ పెట్టారు. ఈ మెయిల్ చూసి షాక్ అయిన‌ సురేష్ బాబు పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. ఈ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గత వారం నలుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన పోలీసులు బుధవారం మీడియాకు వెల్లడించారు. 
 
నలుగురు యువకులు అభిరామ్‌ ఫోన్‌ను దొంగ‌లించాల‌ని పథకం వేశారు. అందులో ఉన్న ఫోటోలు చూసి క్యాష్‌ చేసుకోవాలని భావించారు. ఈ క్రమంలోనే గత నెలలో అభిరామ్‌ ఓ రెస్టారెంట్‌లో ఉన్న సమయంలో అతడి ఐఫోన్‌ను తస్కరించి... దాని పాస్‌వర్డ్‌ను క్రాక్‌ చేసిన దుండగులు అందులో ఉన్న ఫొటోలు, వీడియోల్లో ‘కొన్నింటిని’ చూశారు.

వీటిని అడ్డం పెట్టుకుని అభిరామ్, సురేష్‌బాబు నుంచి డబ్బు గుంజడానికి నిర్ణయించుకున్నారు. దీనికోసం ప్రత్యేకంగా ఓ ఈ–మెయిల్‌ ఐడీని క్రియేట్‌ చేసి, దాని నుంచి గత నెల 24న అభిరామ్‌కు మెయిల్‌ పంపారు. అందులో ‘ఆ ఫొటోలు, వీడియోల’ విషయం ప్రస్తావిస్తూ వాటిని సోషల్‌ మీడియాలో పెడతామని బెదిరించారు. అవి బయటపెట్టకుండా ఉండాలంటే తమకు రూ.1.5 కోట్లు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 
 
అయితే.. సురేష్ బాబు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సాంకేతికంగా దర్యాప్తు చేశారు. బాధ్యులుగా గుర్తించిన కె.రఘురామవర్మ(పశ్చిమగోదావరి జిల్లా నేలమర్రుకు చెందిన నిరుద్యోగి), ఎన్‌.కార్తీక్ ‌(పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన నిరుద్యోగి), తిరుమలశెట్టి నాగవెంకటసాయి(కూకట్‌పల్లిలో కూరగాయలు అమ్మే నేలమర్రు వాసి), పి.చంద్రకిషోర్‌(చింతల్‌లో ఉండే పశ్చిమగోదావరి జిల్లా పెందుర్రుకు చెందిన ప్రైవేట్‌ ఉద్యోగి)లను అరెస్టు చేశారు. అయితే.. నిందితులు ఏ ఫొటోలు, వీడియోల పేర్లు చెప్పి బ్లాక్‌మెయిల్‌ చేశారనేది మాత్రం సీక్రెట్‌గానే ఉంచారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెర్రీతో చిందులేసేందుకు సిద్ధమైన కేథరిన్.. బోయపాటి ఛాన్సిచ్చాడట?