Annurna 7 Acares police Bandho basth
తెలుగు సినీ కార్మికులు నేడు అన్నపూర్ణ ఏడెకరాల స్టూడియోలో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ గబ్బర్ సింగ్ షూటింగ్ జరుగుతోంది. నేటి నుంచి షూటింగ్ లు వాయిదా వేసుకోవాలని ఆదివారంనాడు జరిగిన ఫెడరేషన్ నాయకులు తెలియజేశారు. కానీ అప్పటికే చాలా చోట్ల షూటింగ్ లు మొదలు కావడంతో వారంతా లిఖితపూర్వకంగా ఛాంబర్ కు సమర్పించారు. దానితో వారికి మినహాయింపు ఇచ్చారు. ఈ సందర్భంగా 24 క్రాఫ్ట్ కు చెందిన కొందరు కార్మికులు తెలుగు సినీ కార్మికులకు అన్యాయం జరుగుతోందంటూ మాకు న్యాయం చేయాలి. పవన్ కళ్యాణ్ మా మాట వినాలంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఆర్ట్ డిపార్ట్ మెంట్ కు చెందిన శీను అనే కార్మికులు మాట్లాడుతూ, 30 శాతం పెంచుతున్నాం అంటే 300 మాత్రమే పెరుగుతుంది. కానీ దర్శక నిర్మాతలు, హీరోలు తెలుగు నటీనటులు, టెక్నీషియన్లను బాలీవుడ్, ఇతర ప్రాంతాల వారిని మేనేజర్లను తీసుకువస్తున్నారు. లక్షలు ఖర్చుచేస్తున్నారు. ఈరోజు అన్నపూర్ణ ఏడెకరాల స్టూడియోలో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ జరుగుతుంది.
మేం కార్పెంటర్లం. మేము ఒక్కోసారి కాల్ షీట్ పేరుతో తెల్లవారుజామున 4 గంటలకువెళ్ళి రాత్రి 12 గంటలవరకు వుండాల్సి వస్తుంది. నెలలకొద్దీ సెట్ల పనికోసం చాలా చేస్తున్నాం. అందుకే పవన్ కళ్యాణ్ గారు వున్నారని తెలిసి మేం షూటింగ్ దగ్గరకు వచ్చాం. పవన్ కళ్యాణ్ కి వివరాలు తెలియజేయాలని వచ్చాం.
ఈ సినిమాను మైత్రీ మూవీస్ నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది. తెలుగు చిత్రరంగానికి చెందిన వారిని ఎవరినీ పెట్టుకోలేదు. బాలీవుడ్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి కార్మికులను తెప్పించుకుని పనిచేస్తున్నారు అంటూ మండిపడ్డారు. కార్మికుల బయట వున్నారని తెలిసి మైత్రీ మూవీస్ అదినేత చెర్రీ గేటు లోపలనుంచి చూసి వెంటనే పోలీసులను పిలిపించారు. ఇంతకంటే దారుణం వుంటుందా? అని కార్మికులు ప్రశ్నించారు. పైగా 30 శాతం కార్మికులకు పెంచుతున్నామని నిన్న చెప్పిన నిర్మాతలు నేడు ప్లేట్ మార్చారు. మీ దిక్కున వారికి చెప్పుకోండని మా ఆర్ట్ డిపార్ట్ మెంట్ కు మెసేజ్ వచ్చిందని.. కొందరు వారికి వచ్చిన వాట్సప్ సందేశాలు మీడియాకు చూపించారు.
ఇదిలా వుండగా, నేడు రెండుసార్లు ఛాంబర్ లో 24 క్రాప్ట్ కు చెందిన నాయకులు, ఫిలింఛాంబర్, ఎఫ్.డి.సి. ఛైర్మన్ దిల్ రాజు ఆద్వర్యంలో చర్చలు జరుగుతూనే వున్నాయి. సాయంత్రం అయ్యేసరికి వారి నిర్ణయాలు ప్రకటించలేదు.