Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విక్టరీ వెంకటేష్ బర్త్‌డే స్పెషల్ - "ఎఫ్-3" నుంచి స్పెషల్ వీడియో

Advertiesment
విక్టరీ వెంకటేష్ బర్త్‌డే స్పెషల్ -
, సోమవారం, 13 డిశెంబరు 2021 (12:19 IST)
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తన పుట్టిన రోజు వేడుకలను సోమవారం జరుపుకుంటున్నారు. దీన్ని పురస్కరించుకుని ఆయన నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రమైన "ఎఫ్-3" నుంచి ఓ స్పెషల్ వీడియోను చిత్ర బృందం తాజాగా రిలీజ్ చేసింది. ఇందులో చార్మినార్ సెంటరులో పరుపు వేసుకుని కరెన్నీ కాగితాలతో విసురుకుంటున్న సుల్తాన్ లుక్‌తో వెంకటేష్ కనిపిస్తున్నారు. 
 
తొలి రెండు భాగాలకు దర్శకత్వం వహించిన అనిల్ రావిపూడి మూడో భాగాన్ని కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర కథ మొత్తం డబ్బు చుట్టూనే తిరుగుతుంది. ఇందులో వెంకటేష్‌తో పాటు వరుణ్ తేజ్ నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 
 
అయితే, వెంకటేష్‌కు రేచీకటి, వరుణ్‌కు నత్తి... ఈ రెండు అంశాలతో కావలసినంత కామెండీని పండించేలా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తుండగా, నటి అంజలి, సంగీతలు కీలకమైన పాత్రల్లో నటిస్తున్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన్ని సినిమాలు గెల‌వాలి - నాలుగు సినిమాల‌ క‌ష్టం పుష్ప‌- అల్లు అర్జున్