Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రెచ్చిపోదాం బ్ర‌ద‌ర్ అంటూ విశేషంగా ఆక‌ట్టుకుంటున్న‌ ఎఫ్ 2 బ్ర‌ద‌ర్స్..!

Advertiesment
రెచ్చిపోదాం బ్ర‌ద‌ర్ అంటూ విశేషంగా ఆక‌ట్టుకుంటున్న‌ ఎఫ్ 2 బ్ర‌ద‌ర్స్..!
, గురువారం, 20 డిశెంబరు 2018 (20:53 IST)
విక్ట‌రీ వెంక‌టేష్ - మెగా హీరో వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్లో స‌క్స‌స్‌ఫుల్ యంగ్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తోన్న చిత్రం ఎఫ్ 2. వెంకీ స‌ర‌స‌న త‌మ‌న్నా, వ‌రుణ్ స‌ర‌స‌న మెహ్రీన్ న‌టిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పైన అభిరుచి గ‌ల నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల రిలీజ్ చేసిన టీజ‌ర్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో ఈ అల్లుళ్లు గ‌ట్టిగానే న‌వ్వించేలా ఉన్నార‌నిపిస్తుంది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... రెచ్చిపోదాం బ్ర‌ద‌ర్ అంటూ ఒకే క‌ల‌ర్ సూటు - బూటులో ఉన్న వెంకీ - వ‌రుణ్‌ల పోస్ట‌ర్ రిలీజ్ చేసారు.
 
ఫుల్ వీడియో లిరిక‌ల్ సాంగ్ రిలీజ్ చేసారు. ఈ సాంగ్ అయితే ఫుల్ ఎన‌ర్జిటిక్‌గా ఉంటూ విశేషంగా ఆక‌ట్టుకుంటుంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. ప‌టాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్.. చిత్రాల‌తో హ్యాట్రిక్ సాధించిన అనిల్ రావిపూడి కామెడీని బాగా డీల్ చేస్తాడు. ఇక అత‌నికి వెంకీ - వ‌రుణ్ తోడైతే ఆ సినిమాలో కామెడీ ఏరేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవ‌చ్చు. ఈ సంక్రాంతికి ఈ అల్లుళ్లు అల్ల‌రి ఓ రేంజ్‌లో సంద‌డి చేయ‌డం ఖాయం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ తర్వాత వాటిని తినొచ్చా...