Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సైమా కోసం ఎక్సయిటెడ్ గా ఎదురుచూస్తున్నాను : రానా దగ్గుబాటి

Advertiesment
Rana and SIMA team
, సోమవారం, 4 సెప్టెంబరు 2023 (10:39 IST)
Rana and SIMA team
ప్రతిష్ఠాత్మక ‘సైమా’(SIIMA సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌) 2023 అవార్డ్స్ వేడుక సెప్టెంబరు 15, 16 తేదీల్లో దుబాయ్‌ లో అంగరంగవైభవంగా జరగనుంది. ఈ వేడుకలకు సంబంధించిన ప్రెస్ మీట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది.  హీరో రానా దగ్గుబాటి, హీరోయిన్స్ నిధి అగర్వాల్, మీనాక్షి చౌదరి, సైమా చైర్ పర్సన్ బృందా ప్రసాద్, శశాంక్ శ్రీవాస్తవ్ ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.
 
ప్రెస్ మీట్ లో హీరో రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. దక్షణాది చిత్ర పరిశ్రమలన్నీ కలసి ఆనందంగా జరుపుకునే వేడుక సైమా. గత 11 ఏళ్ళుగా ఈ వేడుకల్లో భాగమౌతున్నప్పటికీ ఇప్పుడే మొదలుపెట్టిన ఉత్సాహం, ఆనందం వుంది. గ్లోబల్ ఫ్లాట్ ఫామ్ కి చేరుకోవడానికి సైమా గొప్ప వేదిక. ఈ వేడుకల్లో భాగం కావడం చాలా ఆనందంగా వుంది. అందరం దుబాయ్ లో కలుద్దాం’’ అన్నారు.  
 
నిధి అగర్వాల్ మాట్లాడుతూ.. సౌత్ లో పని చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి సైమా తో అసోసియేషన్ వుంది. విష్ణు, బృందా గారికి థాంక్స్. ఈ వేడుకల్లో లెజండరీ నటీనటులతో కలసి వేదిక పంచుకోవడం గొప్ప ఆనందాన్ని ఇస్తుంది’’ అన్నారు.
 
మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. సైమా వేడుకల్లో పాల్గొనడం నాకు ఇదే మొదటిసారి. విష్ణు, బృందా గారికి కృతజ్ఞతలు. సైమా అవార్డుల వేడుకే కాదు సినిమాని ఒక పండుగలా జరుపుకునే వేడుక. అన్ని చిత్ర పరిశ్రమలూ పండుగ లా జరుపుకునే ఈ వేడుక కోసం ఎదురుచూస్తున్నాను’’ అన్నారు.
 
సైమా చైర్ పర్సన్ బృందా ప్రసాద్  మాట్లాడుతూ.. సైమా వేడుక అన్ని చిత్ర పరిశ్రమలకు ఒక రీయూనియన్, హోమ్‌కమింగ్ లాంటిది. రానా గారి గురించి మాటల్లో చెప్పలేను. ఆయన లేకుండా సైమా వేడుకని ఊహించలేం. నిధి అగర్వాల్ ఇదివరకే వేడుకల్లో పాల్గొన్నారు. మీనాక్షి కి స్వాగతం.  సైమా వేడుకలకు కౌంట్ డౌన్ మొదలైయింది. రాబోయే రెండు వారాలు ఇంకా మరింత ఎక్సయిటెడ్ గా వుంటుంది. సెప్టెంబర్ 15, 16న దుబాయ్ లో కలుద్దాం’’ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అభిమానులకు క్షమాపణలు చెప్పిన నవీన్ పోలిశెట్టి