Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టిక్కెట్ల రేట్ల జీవో 35ని అమలు చేయండి: ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

Advertiesment
Enforcement of ticket rates Jivo 35
, సోమవారం, 4 అక్టోబరు 2021 (17:20 IST)
Natti Kumar
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సినిమా థియేటర్ల టికెట్ల రేట్లను నిర్ణయిస్తూ తీసుకుని వచ్చిన జీవో 35 అమలు అంశంపై అమరావతి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జ్ బిటర్ నట్టి కుమార్ వేసిన పిటిషన్ కు అనుకూలంగా వెంటనే ఆ జీవో ని అధికారులు అమలుపరచాలంటూ ఏపీలోని అమరావతి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
 
విశాఖపట్నం జిల్లాలోని కొంతమంది థియేటర్ల యజమాన్యాలు 35 జీవో ను అమలుపరచకుండా తమ ఇస్టా నుసారం అధిక రేట్లకు బహిరంగంగా బ్లాక్ లో టిక్కెట్లు అమ్ముతూ ప్రేక్షకుల సొమ్ము దోపిడీ చేయడంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారంటూ, దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తక్షణమే ఈ అన్యాయం, దోపిడీపై చర్యలు తీసుకోవాలంటూ నట్టికుమార్ ఏపీలోని అమరావతి హైకోర్టుకెక్కిన విషయం తెలిసిందే. 
 
35 రూపాయల టిక్కెట్లను కొంతమంది థియేటర్స్ యాజమాన్యాలు 100 రూపాయలకు బహిరంగంగా అమ్ముతున్నారని, ఈ బ్లాక్ మార్కెట్ పై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక ఎం.ఆర్. ఓ., ఆర్డీవో స్థాయి అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో తాను కోర్టుకె క్కానని నట్టికుమార్ ఆరోపించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ బ్లాక్ మార్కెట్ కారణంగా కోట్లాది రూపాయల ఆదాయానికి గండిపడుతోందని ఆయన తన పిటిషన్ లో వివరించారు  దీనిపై తాను కోర్టుకు వెళ్లడంతో కోర్టులో వాదనలు జరిగాయనీ, ఆ మేరకు సోమవారం హైకోర్టు జీవో 35 ని అమలు పరచాలంటూ హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి, విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ కి, అనకాపల్లిt ఆర్డీవోకి మధ్యంతర ఆదేశాలు జారీ చేసిందని నట్టికుమార్ మీడియాకు తెలిపారు.
 
 అనకాపల్లి ఆర్డీవో పై చర్యలు తీసుకోవాలి
 
హైకోర్టులో తాను వేసిన పిటిషన్ పై అనకాపల్లి ఆర్డీవో కౌంటర్ వేయకుండా జీవో 35ను అమలు పరచకుండా కొంతమంది థియేటర్ యజమాన్యాలు, ఒక బడా నిర్మాత, ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్ అయిన ఒక వ్యక్తితో కుమ్మకై వ్యవహరించినప్పటికీ నిజాయితీనే గెలిచిందని నట్టికుమార్ వెల్లడిస్తూ, ఆ ఆర్డీవో పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని నట్టికుమార్ విజ్ఞప్తి చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రారంభమైన శ్రీనివాస్ జొన్నలగడ్డ చిత్రం ఆటో రజిని