Dulquer, Nagachaitanya, brinda,Jagapathi Babu, Suresh Babu, Aditirao Haideri
మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్, అదితి రావు హైదరి, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం హే సినామిక. ప్రముఖ సీనియర్ కొరియోగ్రాఫర్ బృంద మాస్టర్ ఈ చిత్రంతో దర్శకురాలిగా మారారు. జియో స్టూడియోస్, గ్లోబల్ వన్ స్టూడియోస్ పతాకాలపై సినిమా రూపొందుతుంది. మార్చి 3న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్బంగా మంగళవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అక్కినేని నాగ చైతన్య, దుల్కర్ సల్మాన్, జగపతి బాబు, సురేష్ బాబు, అదితిరావు హైదరి, బృంద మాస్టర్, తదితరులు పాల్గొన్నారు.
అక్కినేని నాగ చైతన్య మాట్లాడుతూ, బృంద మాస్టర్‌గారు సినిమాను డైరెక్ట్ చేస్తున్నారని తెలియగానే చాలా హ్యాపీగా అనిపించింది. ఆమె కొరియోగ్రఫీకి నేను పెద్ద ఫ్యాన్‌ని. మాంటేజ్ సాంగ్‌లను చిత్రీకరించడంలో ఆమెకు సెపరేట్ స్టైల్ ఉంటుంది. దానికి నేను పెద్ద అభిమానిని. మనం సినిమాలో కనులను తాకే.. పాటను ఆమెనే కొరియోగ్రఫీ చేశారు. ఎన్నో సాంగ్స్ ఆమె అద్భుతంగా కొరియోగ్రఫీ చేశారు. ఆమె ఓ లవ్‌స్టోరిని డైరెక్ట్ చేస్తున్నారని తెలియగానే హ్యాపీగా అనిపించింది. ఆమె డైరెక్టర్‌గా పెద్ద సక్సెస్ అయినా, కొరియోగ్రఫీ మాత్రం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నాకు దుల్కర్‌తో మంచి అనుబంధం ఉంది. చెన్నైలోనే తను నాకు తెలుసు. ఆటోమొబైల్స్, ఇతర విషయాలు గురించి చాలానే మాట్లాడుకున్నాం. సినిమాల గురించి ఎప్పుడూ మాట్లాడుకోలేదు. దుల్కర్, నేను యాక్టర్స్ అవుతామని అనుకోలేదు. కానీ ఇప్పుడు యాక్టర్స్‌గా మారి స్టేజ్‌పై నిలబడి ఉన్నాం` అన్నారు.
దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ, హే సినామిక ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వచ్చిన చైతన్య, జగపతిబాబుగారు ఇతర అతిథులు, నటీనటులందరికీ ధన్యవాదాలు. చాలా గ్యాప్ తర్వాత థియేటర్స్‌లో సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ క్రమంలో మా హే సినామిక సినిమా మార్చి3న విడుదలవుతుండటం చాలా హ్యాపీగా ఉంది. బృంద మాస్టర్‌గారు ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు. ఓ యాక్టర్‌గా నన్ను సాంగ్స్‌లో రొమాంటిక్‌గా చూపించడంలో కొరియోగ్రాఫర్‌గా ఆమె పాత్ర ఎంతో ఉంది. మా అమ్మ నా తల్లిలాంటిది. ఆమె గురించి మాట్లాడే ప్రతి సందర్భంలో ఎమోషనల్ అవుతుంటాను. ఈ సినిమాతో ప్రేమలో పడతారు. ఎమోషనల్ అవుతారు. డాన్స్ చేస్తారు. మార్చి 3న థియేటర్స్‌లో సందడి చేయడానికి రాబోతున్నాం అన్నారు.
డైరెక్టర్ బృంద మాస్టర్ మాట్లాడుతూ నేను కొరియోగ్రాఫర్‌గా ఈ రోజు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నానంటే అందుకు కారణం రామానాయుడుగారు, సురేష్ బాబుగారే. ఈ వేడుకకి పిలవగానే పెద్ద మనసు చేసుకుని వచ్చిన సురేష్ బాబుగారికి ధన్యవాదాలు. అలాగే నందినీ రెడ్డికి కూడా స్పెషల్ థాంక్స్. అలాగే జగపతి బాబుగారికి, నాగ చైతన్యకు థాంక్స్. అదితిరావు హైదరికి థాంక్స్. దుల్కర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే తను వినగానే వెంటనే ఓకే చెప్పేసి ఎంతగానో సపోర్ట్ అందించాడు. అందరితో పాటు హే సినామిక సినిమాకు వర్క్ చేసిన ఎంటైర్ టీమ్‌కు థాంక్స్ అన్నారు.
అదితి రావు హైదరి మాట్లాడుతూ మార్చి 3న మా హే సినామిక సినిమా రానుంది. ఎగ్జయిటింగ్‌గా ఉంది. బృందగారిని మా అమ్మగారిలా ట్రీట్ చేస్తుంటాను. ఈ సినిమా కోసం నన్ను ఎంతో అందంగా చక్కగా చూపించారు. అలాగే దుల్కర్‌ను ఎంతగానో ఆరాధిస్తాను. తను మంచి నటుడు, నాకు మంచి స్నేహితుడు. సినిమాను చూసి మాతో ప్రేమలో పడతారని అనుకుంటున్నాను అన్నారు.
డి.సురేష్ బాబు మాట్లాడుతూ హే సినామిక ట్రైలర్ చూడగానే బాగా నచ్చింది. ఎవరు డైరెక్టర్ అని చూస్తే బృంద అని ఉంది. నేను ఫోన్ చేస్తే బృంద మాస్టర్ డైరెక్టర్ అని తెలిసి చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే తను కొరియోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నప్పటి రోజుల నుంచి తెలుసు. దుల్కర్, అదితిరావు సహా ఎంటైర్ యూనిట్‌కు అభినందనలు అన్నారు.
జగపతి బాబు మాట్లాడుతూ బృంద మాస్టర్ కెరీర్‌లో నేను మోస్ట్ డిఫకల్ట్ హీరో అయ్యుంటాను. చిన్నపిల్లలకు నేర్పినట్లు డాన్స్ నేర్పింది. తను లెజెండ్రీ కొరియోగ్రాపర్. తను ఇప్పుడు హే సినామికతో డైరెక్టర్ అయ్యింది. తను డైరెక్టర్‌గా సక్సెస్ కావాలని అనుకుంటున్నాను. నేను దుల్కర్‌ను ఎప్పటి నుంచో కలవాలని అనుకుంటున్నాను. గొప్ప నటుడు. అదితిరావుతో నేను ఇది వరకే నటించాను. తను సిన్సియర్ యాక్ట్రెస్. కాజల్ కూడా మంచి నటి. ఎంటైర్ టీమ్‌కు అభినందనలు అన్నారు.