Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Advertiesment
CPI Narayana

దేవీ

, శుక్రవారం, 21 మార్చి 2025 (17:38 IST)
CPI Narayana
అనైతికమైన ప్రకటనల్లో నటించకండి, కాసుల కోసం కక్కుర్తి పడకండి అంటూ  సినీ పరిశ్రమకి ఢిల్లీలో వున్న సిపిఐ నారాయణ హితవు పలికారు. సంపాదన కోసం యువతను నాశనం చేసే బెట్టింగ్ యాప్ లను, సమాజాన్ని చెడగొట్టే వ్యాపార ప్రకటనలను ఇవ్వకండని సినీ పరిశ్రమకు సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ హితవు పలికారు.
 
పవిత్రమైన కళామతల్లిని సమాజ అభివృద్ధికి మాత్రమే ఉపయోగ పద్ధతుల్లో వినియోగించుకోవాలని సూచించారు. బెట్టింగ్ యాప్ లకు ప్రచారం చేసిన కొందరు సినీ ప్రముఖులపై హైదరాబాద్ లోని మాదాపూర్, పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేసిన వ్యవాహారం పై నారాయణ స్పందించారు.
 
ఢిల్లీలోని ఆంధ్రా భవన్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో నారాయణ మాట్లాడుతూ సినీ పరిశ్రమ ద్వారా వచ్చిన ఖ్యాతిని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదన వ్యామోహంతో అనైతిక చర్యలకు పాల్పడదాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.
 
బెట్టింగ్ యాప్ ల ను ప్రమోట్ చేయడం ద్వారా యువత జీవితాలను నాశనం చేస్తున్నారని ఆక్షేపించారు. గతంలో  అల్లూరి రామలింగయ్య వంటి వారు కళను సమాజ అభివృద్ధి కి ఉపయోగ పరచారని గుర్తు చేశారు.
 
సినీ పరిశ్రమలో సక్రమంగా వచ్చే సంపాదన ఉన్నవారు కూడా మరింత సంపాదన కోసం సమాజాన్ని పక్కదారి పట్టించే అనేక అనైతిక ప్రకటనల్లో నటించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
తమకే తెలియకుండా బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేశామని ఒకరు, చట్ట పరంగా అవకాశం ఉన్నది కాబట్టి చేశామని ఒకరు పేర్కొనడాన్ని తప్పుబట్టారు. మీకు ఉన్న పాపులరిటి కారణంగా మీరు నటించే, ప్రమోట్ చేసే అంశాలను ప్రజలు సులభంగా నమ్మి తీవ్రంగా ఇబ్బంది పడుతున్న విషయాన్నీ గుర్తించాలన్నారు. బెట్టింగ్ యాప్ లకు వేలాది మంది యువత బలి అవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నా వాటిని ఇంకా ప్రమోట్ చేయడం నేరమేనని స్పష్టం చేశారు. ఈ వ్యవాహరం పై ప్రభుత్వం కఠినముగానే చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.
 
గుట్కా, పాన్ మసాలాలు, తప్పుడు పద్ధతుల్లో సాగే రియల్ ఎస్టేట్, మోసపూరిత బంగారు వ్యాపారాల ప్రకటనల్లో నటించి సమాజానికి కీడు చేస్తున్నారని పేర్కొన్నారు.
 
గతంలో కోకో కోలా కంపెనీ యాడ్ చేసిన తరుణంలో తాను చేసిన వ్యాఖ్యలకు సినీ హీరో చిరంజీవి స్పందించి ఇకపై అటువంటి యాడ్ లు చేయనని ప్రకటించారని గుర్తు చేశారు.
 
చట్టాల్లో చాలా లొసుగులు ఉంటాయి అని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షులు ట్రంప్ తాను చట్టం లోని లొసుగుల ఆధారంగానే అనేక కేసుల నుంచి తప్పించుకుంటున్నట్టు బహిరంగానే పేర్కొన్నారాని తెలిపారు.
 
మనదేశంలో గుట్కా కూడా ఆహర పదార్థమే అని ఒక న్యాయమూర్తి తీర్పు ఇచ్చిన సందర్బం ఉందని పేర్కొన్నారు. అయితే చట్టం, డబ్బు కన్నా నైతికత చాలా ముఖ్యం అని స్పష్టం చేశారు.
 
ఇకనైనా సామాజానికి హాని చేసే అన్ని రకాల వ్యాపార ప్రకటనలకి సినిమా పరిశ్రమ దూరంగా ఉండాలని పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత