Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Two headed snake: శివాలయంలో రెండు తలల పాము.. వీడియో వైరల్

Advertiesment
Two Head snakes

సెల్వి

, శుక్రవారం, 21 మార్చి 2025 (14:09 IST)
Two Head snakes
పాములు అంటే భయపడనివారు ఎవరూ ఉండరు. కొందరైతే పాము కనపడితే పరుగులు తీస్తారు. అయితే రెండు తలల పాము ఇంట్లో ఉంటే.. కుబేరులు అవుతారని తాంత్రిక పూజలు చేసేవారు నమ్మిస్తూ ఉంటారు. ఇది తప్పుడు ప్రచారం. ఈ పామును రెండ్ శాండ్ బోవా అని అంటుంటారు. ఈ పాము విషపూరితమైనది అస్సలు కాదు.
 
అసలు విషయం ఏంటంటే.. హైదరాబాద్‌ నాచారంలోని దుర్గానగర్ శివాలయం ఆవరణలో రెండు తలల పాము సంచరించింది. దీన్ని చూసిన భక్తులు భయాందోళనలకు గురయ్యారు. 
 
వెంటనే ఆలయ నిర్వహకులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులతో పాటు అటవీ శాఖాధికారులు అక్కడికి చేరుకున్నారు. పామును ఆలయం నుంచి తరలించడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశ, ప్రపంచ నగరాల్లో శ్రీవారి ఆలయాలు.. బాబు వుండగానే క్యూలైన్‌లో కొట్టుకున్న భక్తులు.. (Video)