Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టాప్ గేర్ లాంటి మరో సరికొత్త సినిమాతో రాబోతున్న దర్శకుడు కె. శశికాంత్

Director K. Shashikanth
, శనివారం, 21 జనవరి 2023 (22:10 IST)
Director K. Shashikanth
నేటితరం ఆడియన్స్ కొత్త కథలకు బాగా కనెక్ట్ అవుతున్నారు. డిఫరెంట్ పాయింట్‌తో తెరకెక్కే సినిమాలను ఆదరిస్తూ గొప్ప విజయం అందిస్తున్నారు. ప్రేక్షకులు కోరుకుంటున్న ఇదే బాటలో వెళుతూ నూతన దర్శకులు సైతం వినూత్నమైన కథా కథనాలతో ఆడియన్స్‌కి చేరువవుతున్నారు. అలాంటి దర్శకుల్లో ఒకరు కె. శశికాంత్. రీసెంట్ గా ఆది సాయి కుమార్ హీరోగా టాప్ గేర్ సినిమా తెరకెక్కించి తన టాలెంట్ బయటపెట్టారు న్యూ డైరెక్టర్ కె. శశికాంత్.
 
ఓ క్యాబ్ డ్రైవర్ నేపథ్యంలో తొలి సినిమాను రూపొందించి టాప్ గేర్ వేసేశారు కె. శశికాంత్. ఆసక్తికరమైన ఓ డిఫరెంట్ జానర్ సెలక్ట్ చేసుకొని ప్రేక్షకుల నుంచి ఫస్ట్ ఇంప్రెషన్ కొట్టేశారు. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. కథను నెరేట్ చేసిన విధానం చూసి ఫిదా అయ్యారంతా. ఎంతో గ్రిప్పింగ్ గా స్టోరీని నడిపిస్తూ ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యారు కె. శశికాంత్. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కడమే గాక ప్రేక్షకులకు వినూత్న అనుభూతి కలిగించింది. 
 
సినీ ప్రపంచంలో మూవీ సక్సెస్ కావాలంటే ప్రధానమైన పాత్ర చిత్ర దర్శకుడిదే అని చెప్పుకోవాలి. కథలో ఉన్న బలానికి ఆసక్తికర కథనాన్ని జోడించి ఆడియన్స్‌ను ఎంగేజ్ చేయడంలో దర్శకుడిదే ముఖ్యపాత్ర. ప్రతి ఫ్రేమ్ కూడా బ్యూటిఫుల్‌గా ప్రెజెంట్ చేస్తూ సన్నివేశాల మేళవింపుగా సినిమాను తెరకెక్కించడంలోనే దర్శకుడి నైపుణ్యం బయటపడుతుంది. రీసెంట్‌గా వచ్చిన టాప్ గేర్ సినిమాతో కె.శశికాంత్ అదే నిరూపించుకున్నారు. తన నైపుణ్యం వెలికితీసి జనం దృష్టిలో పడ్డారు. 
 
త్వరలోనే ఈ టాప్ గేర్ సినిమాను ప్రముఖ ఓటీటీ వేదికపై రిలీజ్ చేయబోతున్నారు. యువ దర్శకుడిగా ఈ సినిమాతో సక్సెస్ అందుకున్న కె. శశికాంత్ ప్రస్తుతం తన తదుపరి సినిమాపై ఫోకస్ పెట్టారు. ప్రముఖ హీరోతో శశికాంత్ నెక్స్ట్ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు నడుస్తున్నాయి. 
టాప్ గేర్ లాగే మరో డిఫరెంట్ పాయింట్ తీసుకొని స్టోరీ సిద్ధం చేసుకున్నారట. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు డైరెక్టర్ కె. శశికాంత్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రామ్ చ‌ర‌ణ్‌కి షారూఖ్ ఖాన్ కండీషన్‌