Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మంచి కంటెంట్‌ ఉంటేనే నిర్మాతలు ముందుకు వస్తారు : టాప్ గేర్ హీరో ఆది సాయి కుమార్

Adi Sai Kumar
, మంగళవారం, 27 డిశెంబరు 2022 (16:09 IST)
Adi Sai Kumar
ఆది సాయి కుమార్ ఇప్పుడు 'టాప్ గేర్' వేసి మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. కె. శశికాంత్ దర్శకత్వంలో  K. V. శ్రీధర్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఆదిత్య మూవీస్,  ఎంటర్‌టైన్‌ మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై సర్వ హంగులతో ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రం డిసెంబర్ 30న విడుదల కాబోతున్న సందర్భంగా ఆది సాయి కుమార్ బుధవారం నాడు మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన విశేషాలివే.
 
 ఒకే ఏడాది మూడు సినిమాలు వచ్చాయి. ఎలా అనిపిస్తున్నది?
కరోనా వల్ల అన్ని సినిమాలు ఆలస్యమయ్యాయి. అందుకే అన్నీ ఒకే సారి వస్తున్నాయి. ఇక సమ్మర్ సీజన్‌లో పెద్ద సినిమాలు రావడంతో డేట్స్ అడ్జస్ట్ అవ్వలేదు. చిన్న సినిమాలకు ప్రస్తుతం డేట్స్ దొరకడం కష్టంగా మారింది. అందుకే ఈ ఏడాదిలో నా నుంచి మూడు చిత్రాలు వచ్చాయి.
 
 టాప్ గేర్ సినిమా కథలో ఏ అంశం నచ్చింది? సినిమాను ఎందుకు ఎంచుకున్నారు?
టాప్ గేర్ కథ నాకు బాగా నచ్చింది. క్యాబ్ డ్రైవర్‌.. అతని జీవితంలో చిన్న సమస్య.. అది పెద్దగా మారడం.. ఒక్క రోజులో ఈ కథ జరుగుతుంది.. మా టీం అందరికీ ఈ కథ నచ్చింది. అందుకే ఈ సినిమాను చేశాం.
 
పూర్తిగా సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాగుతుందా?* 
టాప్ గేర్ అనేది కంప్లీట్ సస్పెన్స్ థ్రిల్లర్ ఏమీ కాదు. ఓ కుర్రాడు తనకు సంబంధం లేని చిక్కుల్లో ఇరుక్కుంటే ఏం అవుతుంది.. దాన్నుంచి ఎలా బయటపడతాడు అనేది చూపిస్తాం. ఐడియా కొత్తగా ఉంటే నేను సినిమాలను ఎంచుకుంటాను. ఐడియా బాగుంటే సగం సినిమా హిట్ అయినట్టే. మిగతాది అంతా స్క్రీన్ ప్లేలో ఉంటుంది. అయినా జనాలకు ఇప్పుడు ఏది నచ్చుతుందనేది అంచనా వేయలేకపోతున్నాం.
 
 పూర్తి మాస్ సినిమాలు చేయాలని అభిమానులు కోరుతుంటారు. మరి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారా?
ఇప్పుడు మాస్ స్టోరీలంటే అర్థం మారింది. కేజీయఫ్ సినిమా వచ్చి అంతా మార్చేసింది. అలాంటి సినిమాలే ఇప్పుడు మాస్‌కు నచ్చుతున్నాయి. ఇప్పుడు చేస్తే అలాంటి సినిమానే చేస్తాను. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను చేయను.
 
ఈ సినిమాలో ఫైట్స్ కీలకంగా మారేలా ఉన్నాయి ?
రొమాంటిక్ సినిమాతో ఫైట్ మాస్టర్ పృథ్వీకి మంచి బ్రేక్ వచ్చింది. ఎంతో సహజంగా ఫైట్‌లను కంపోజ్ చేస్తుంటాడు. ఫైట్‌లో కూడా కథను చెప్పాలని చూస్తాడు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. తెల్లవారుఝామున నాలుగు గంటలకు ఓ సీన్ చేశాం. ఆ టైంలో యాక్సిడెంట్‌ కూడా జరిగింది. ఈ సినిమా కోసం యాక్షన్ సీక్వెన్స్‌ అంతా కూడా రాత్రే షూటింగ్ చేశాం.
 
ఈ  సినిమాకు కారు కీలకంగా మారుతున్నట్టుంది?ప్రత్యేకంగా కారుని డిజైన్ చేశారా?
టాప్ గేర్ సినిమా అంతా కూడా కారులోనే ఉంటుంది. కాబట్టి మా ఆర్ట్ డైరెక్టర్, సినిమాటోగ్రఫర్ ఆ విషయంంలో కాంప్రమైజ్ అవ్వలేదు. చాలా బాగా డిజైన్ చేశారు. ఇందులో నేను క్యాబ్ డ్రైవర్ పాత్రలో కనిపిస్తాను. కానీ కథలో ఓ భాగంగానే ఆ పాత్ర ఉంటుంది.
 
 ఈ సినిమాకు మ్యూజిక్, ఆర్ఆర్ ప్రాముఖ్యత ఎంత ఉంటుంది?
టాప్ గేర్ సినిమాకు ఆర్ఆర్ చాలా ముఖ్యం. హర్షవర్దన్ రామేశ్వర్ మాకు అద్భుతంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఆయన అంతకు ముందు ఆర్జున్ రెడ్డి చేశాడు. ప్రస్తుతం రవితేజ రావణాసుర, యానిమల్ సినిమాలు చేస్తున్నాడు. టాప్ గేర్ సినిమా బాగుందని ఆయన కూడా అన్నారు. సినిమాలో ఒకే ఒక్క పాట ఉంటుంది.
 
కొత్త కథలు, ప్రయోగాలు చేసేందుకు ఆసక్తిగానే ఉన్నారా?
కొత్త కథలు చేయాలని, ప్రయోగాలు చేయాలని ఉంటుంది. ప్రస్తుతం నేను ఒక వెబ్ సిరీస్‌ చేస్తున్నాను. జీ5 కోసం నేను చేయబోతున్న వెబ్ సిరీస్‌లో ఎవ్వరూ ఊహించనటువంటి పాత్రను పోషిస్తున్నాను. కానీ నా వద్దకు వచ్చే కథలన్నీ కమర్షియల్ యాంగిల్‌లోనే ఉంటాయి. కానీ నాకు రియలిస్టిక్ సినిమాలు చేయాలని ఉంటుంది.
 
నెగెటివ్ రోల్స్ ఏమైనా చేస్తారా? ఆ దిశగా ఏమైనా ఆఫర్లు వచ్చాయా?* 
నెగెటివ్ రోల్స్‌ ఆఫర్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు హీరోగా మంచి చిత్రాలు చేస్తున్నాను. ఇప్పుడు అన్నీ కూడా చకాచకా చిత్రాలు చేసేయాలని అనుకుంటున్నాను.
 
భవిష్యత్ సినిమాల గురించి చెప్పండి? 
నేను ప్రస్తుతం లక్కీ మీడియాకు ఓ సినిమా చేస్తున్నాను. జీ5 కోసం చేసిన వెబ్ సిరీస్ షూటింగ్ అయిపోయింది. వచ్చే నెలలో ప్రమోషన్స్ మొదలుపెడతారు. సినిమాకు తక్కువ కాకుండా ఉంటుంది. మొదటి సీజన్‌లో ఎనిమిది ఎపిసోడ్‌లు ఉంటాయి.
 
మీ మాస్ ఇమేజ్‌ను చూసి నిర్మాతలు ముందుకు వస్తున్నారా?
మంచి కంటెంట్‌ ఉంటేనే నిర్మాతలు ముందుకు వస్తారు. నా ప్రతీ సినిమా టెక్నికల్‌గా బాగా ఉంటుంది. నా చిత్రాలు ఓటీటీలోనూ బాగానే ఆడుతుంటాయి. కొన్ని పరిస్థితుల వల్ల థియేటర్లో సరిగ్గా ఆడలేదు. శశి సినిమాకు థియేటర్లో ఓపెనింగ్స్ వచ్చాయి. ఓటీటీలో బాగా ఆడింది. క్రేజీ ఫెల్లో సినిమా కూడా ఓటీటీలో బాగా ఆడింది. 
 
మీ నాన్న గారి సినిమాలైనా, పాటల్లో ఏదైనా రీమేక్ చేయాలని అనుకుంటున్నారా?
నాన్న గారి పాటను రీమేక్ చేయాలని ఉంది. 'అసలేం గుర్తుకురాదు' అనే పాటను రీమేక్ చేయాలని ఉంది. కానీ ఆ సిట్యువేషన్ పడాలి. అయితే ఆ సాంగ్‌ను రీమేక్ చేస్తే మళ్లీ కృష్ణవంశీ గారే తీయాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డ్యాన్స్ చేయడం వల్ల నా వెన్ను నొప్పి బాధ పెట్టింది : చంద్రిక రవి