Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డ్యాన్స్ చేయడం వల్ల నా వెన్ను నొప్పి బాధ పెట్టింది : చంద్రిక రవి

Chandrika Ravi
, మంగళవారం, 27 డిశెంబరు 2022 (15:36 IST)
Chandrika Ravi
నందమూరి బాలకృష్ణ 'వీరసింహారెడ్డి'లో స్పెషల్ సాంగ్ 'మా బావ మనో భావాలు దెబ్బతిన్నాయి' పాట చేసిన మలయాళీ నటి చంద్రిక రవికి ఒక వైపు ఆనందంగా ఉంటె, మరోవైపు వెన్ను నొప్పితో బాధ పడింది. ఈ విషయాన్ని చెప్పకుండా డాన్స్ చేసింది. ఆస్ట్రేలియాలో పెరిగిన ఆమె  ఈ నేపధ్యంలో  'వీరసింహారెడ్డి' చిత్ర  విశేషాలను కొత్త సినిమాలు ఇలా పంచుకున్నారు చంద్రికరవి. 
 
మా బావ మనోభావాలు పాట విడుదలైన గంటల్లోనే 10 మిలియన్స్ వ్యూస్ ని క్రాస్ చేసి బ్లాక్ బస్టర్ అయ్యింది. ఎలా అనిపిస్తుంది ?
చాలా ఆనందంగా వుంది. ఆస్ట్రేలియాలో ఓ చిన్న టౌన్ లో పుట్టాను. అయితే మా కుటుంబ మూలాలు దక్షిణ భాతరదేశం లో వున్నాయి. చిన్నప్పటి నుండి సౌత్ సినిమాలు చూస్తూ పెరిగాను. నా కెరీర్ లో ఇంత త్వరగా ఇంత పెద్ద అవకాశం వస్తుందని అనుకోలేదు. బాలకృష్ణ గారి సినిమాలో అవకాశం రావడం నా కల నెరవేరినట్లయింది.
 
ఆస్ట్రేలియాలో పెరిగిన మీరు  ఇక్కడి  పాటకు ఎలా ఫెర్ ఫార్మ్ చేయగలిగారు ?
ఈ విషయంలో మా తల్లి తండ్రులకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆస్ట్రేలియాలో పుట్టినప్పటికీ ఇంట్లో సౌత్ ఇండియన్ కల్చరే వుండేది. నాకు మూడేళ్ళు ఉన్నప్పుడే భరతనాట్యం, కూచిపూడి, కథక్ లాంటి నృత్యరూపకాలు నేర్పించారు. అలాగే వెస్ట్రన్ కల్చర్స్ కి సంబధించిన డ్యాన్సులు కూడా నేర్చుకున్నాను. మా అమ్మగారు మంచి డ్యాన్సర్. నాన్న గారు తబలా వాయిస్తారు. ఈ రకంగా సౌత్ ఇండియన్ కల్చర్, ఆర్ట్ అనేది నా జీవితంలో అంతర్భాగం అయ్యింది.
 
బాలకృష్ణ గారితో పని చేయడం ఎలా అనిపించింది ?
బాలకృష్ణ గారితో పని చేయడం ఒక కల నెరవేరినట్లయింది. బాలకృష్ణ గారి సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన అంటే ఎంతో అభిమానం. స్క్రీన్ షేర్ చేసుకోవడమే కాదు బాలకృష్ణ గారితో డ్యాన్స్ చేయడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి. జీవితం, సినిమాల పట్ల బాలకృష్ణ గారికి వున్న పరిజ్ఞానం అమోఘం. ఎన్నో గొప్ప విషయాలని పంచుకున్నారు. ఈ జ్ఞాపకాలని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను.
 
పాటకి, డ్యాన్సులకి, సోషల్ మీడియా నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది.?
చాలా అద్భుతమైన స్పందన వస్తోంది. పాటని ప్రేక్షకులు ఎంతగానో ప్రేమిస్తున్నారు. వారి ప్రేమ నాకు గొప్ప కాన్ఫిడెన్స్ ని ఇచ్చింది. ఈ పాట నా జీవితాన్ని గొప్పగా మార్చింది. ఇదంతా బాలకృష్ణ గారి వలనే సాధ్యమైయింది.
 
పాట చిత్రీకరణలో మీరు ఎదురుకున్న సవాల్ ఏమైనా ఉందా ?
పాట చిత్రీకరణ మరో రోజులో ముగుస్తుందనగా నా వెన్ను కాస్త బెణికింది. నొప్పి బాధ పెట్టింది. ఈ సంగతి సెట్ లో ఎవరికీ చెప్పలేదు. డ్యాన్సర్స్ అంతా అద్భుతంగా ఫెర్ ఫార్మ్ చేస్తున్నారు. వారి ఎనర్జీని మ్యాచ్ చేయడానికి నొప్పి లోనే నా శక్తిమేరకు కృషి చేశాను. ఎందుకంటే ఇలాంటి అవకాశం జీవితంలో ఒకసారే వస్తుంది. షూటింగ్ పూర్తయిన తర్వాత దర్శకుడు గోపీచంద్, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కి నొప్పి గురించి చెప్పాను. 'నొప్పితో బాధపడుతున్నావ్ అని మాకసలు తెలీదు. చాలా అద్భుతంగా చేశావు'' అని చెప్పారు. పాట విడుదలైన తర్వాత వచ్చిన రెస్పాన్స్ చూస్తే కష్టానికి తగిన ఫలితం దక్కిందనిపించింది.
 
పాటలో హనీ రోజ్ కూడా వున్నారు.. ఆమెతో కలసి పని చేయడం ఎలా అనిపించింది ?
హనీ రోజ్ తో కలసి పని చేయడం చాలా ఎంజాయ్ చేశాను. మేము ఇద్దరం మలయాళీలమే. చాలా ఫ్రెండ్లీ గా పని చేశాం.
 
మీ కొత్త సినిమాల గురించి ?
కొన్ని తమిళ సినిమాలు చేస్తున్నా. అలాగే ఒక తెలుగు సినిమా చర్చల దశలో వుంది. అలాగే యుఎస్ లో కొన్ని షో కూడా ప్లానింగ్ లో వున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన్నపూర్ణ ఫొటో స్టూడియో కాన్సెప్ట్ పోస్టర్, టైటిల్ రివీల్ చేసిన హరీష్ శంకర్