Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కంటెంట్ నచ్చి టాప్ గేర్ నిర్మించాం : నిర్మాత శ్రీధర్ రెడ్డి

Producer Sridhar Reddy
, గురువారం, 29 డిశెంబరు 2022 (17:21 IST)
Producer Sridhar Reddy
హీరో ఆది సాయి కుమార్ ప్రస్తుతం 'టాప్ గేర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు.  శ్రీధర్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో తెరకెక్కింది. ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాకు కె. శశికాంత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం డిసెంబర్ 30న విడుదల కాబోతున్న సందర్భంగా నిర్మాత శ్రీధర్ రెడ్డి గురువారం నాడు మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన విశేషాలివే.. 
 
 టాప్ గేర్ సినిమా ఎలా ఉండబోతోంది?
టాప్ గేర్ సినిమా చాలా బాగుండబోతోంది. ఈ సినిమాతో ఆదికి వచ్చే ఏడాది శుభారంభం కానుంది. ఆది మంచి డ్యాన్సర్. మంచి నటుడు. టాప్ గేర్ సినిమాతో వచ్చే ఏడాది ఆయన దశ మారుతుంది.
 
 టాప్ గేర్ సినిమాలో మీకు ఏ పాయింట్ నచ్చింది?
మనం కథ విన్నప్పుడు అది మనల్ని హాంట్ చేయాలి. శశికాంత్ ఈ కథ చెప్పిన తరువాత నాకు చాలా నచ్చింది. ఈ కథ విన్న తరువాత ఆది అయితే బాగుంటుందని మేం అనుకున్నాం. వెళ్లి కథ చెప్పాం. ఆయన ఓకే అన్నారు.
 
 టాప్ గేర్‌ సినిమా కోసం డైరెక్టర్ చేసిన వర్క్ ఎలా అనిపించింది?
టాప్ గేర్ సినిమాను డైరెక్టర్ అద్భుతంగా తీశారు. ఇందులో స్క్రీన్ ప్లే హైలెట్ అవుతుంది. నెక్ట్స్ సీన్ ఏంటి? అనే ఆసక్తిని రేకెత్తించేలా సినిమాను తీశారు.
 
హర్షవర్దన్ మ్యూజిక్, ఆర్ఆర్ గురించి చెప్పండి?
టాప్ గేర్ సినిమాకు అసలు హీరో ఆయనే. ఇలాంటి సినిమాలకు హర్షవర్దన్ మ్యూజిక్, ఆర్ఆర్ ప్లస్ అవుతుంది.
 
 టాప్ గేర్ సినిమాకు బడ్జెట్ పెరిగిందా?
ముందు అనుకున్న బడ్జెట్ కన్నా కాస్త పెరిగింది. క్వాలిటీ కోసమే ఖర్చు పెట్టాం. సినిమాను చూశాక ఆడియెన్స్‌ కూడా అదే మాట చెబుతారు. కంటెంట్ మీదున్న నమ్మకంతోనే సినిమాను తీశాం. నాకున్న పరిచయాలతో సినిమాను సేఫ్ ప్రాజెక్ట్‌గా మార్చగలను.
 
 టాప్ గేర్ కథ ఏంటి?
క్యాబ్ డ్రైవర్‌లకు కస్టమర్లతో కూడా సమస్యలు వస్తుంటాయి. అలా అనుకోకుండా హీరో ఓ సమస్యలో చిక్కకుంటాడు. దాన్నుంచి ఎలా బయటపడతాడు అనేది కథ. తన భార్యను కాపాడుకునేందుకు హీరో చేసే ప్రయత్నాలు బాగుంటాయి.
 
 ప్రస్తుతం నిర్మాతలు ఎదుర్కొంటున్న సవాళ్లు ఏంటి?
ప్రతీది నిర్మాతకు చాలెంజింగ్‌గానే ఉంటుంది. సినిమాను ప్రారంభించడం, పూర్తి చేయడం, రిలీజ్ చేయడం అన్నీ సవాళ్లే. మనకు సినిమాలంటే ఇష్టం, ప్యాషన్ కాబట్టి చేస్తుంటాం. వాటిని ఎదుర్కోగలను అనే ధైర్యం ఉంటేనే ఇందులోకి రావాలి. మా సినిమా అద్భుతంగా వచ్చింది. మా చిత్రం మీద నాకు నమ్మకం ఉంది.
 
 టాప్ గేర్ సినిమాను చూశాక సాయి కుమార్ రియాక్షన్ ఏంటి?
ఆదికి 2023 చాలా బాగుండబోతోందని, టాప్ గేర్ సినిమాతో అది ప్రారంభం అవుతుందని సాయి కుమార్‌ గారు చెప్పుకొచ్చారు. టాప్ గేర్ సినిమా పట్ల ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏ మాయ చేసావే సీక్వెల్.. సమంత స్థానంలో రష్మిక..?