Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నా ఇంట్లోకి నేను వెళ్ళడం ట్రస్ పాస్ ఎలా అవుతుంది? దాసరి అరుణ్ కుమార్

నా ఇంట్లోకి నేను వెళ్ళడం ట్రస్ పాస్ ఎలా అవుతుంది? దాసరి అరుణ్ కుమార్
, శనివారం, 27 జూన్ 2020 (20:14 IST)
"నా ఇంట్లోకి నేను వెళ్ళటం ట్రస్ పాస్ ఎలా అవుతుంది? నాకు సంబంధించిన కొన్ని గవర్నమెంట్ డాక్యుమెంట్స్ తీసుకోవటానికి వెళ్ళాను... ఎంతసేపు బెల్లు కొట్టినా ఎవరూ గేట్ తీయకపోవడంతో గేట్ దూకి వెళ్ళాను. సొంత ఇంట్లో తలుపులు తీయకపోతే ఎవరైనా చేసే పని అదే. కాబట్టి నేను ఎలాంటి అతిక్రమణకు పాల్పడలేదు" - అంటూ నిన్న మీడియాలో తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చారు దాసరి అరుణ కుమార్.
 
ఈ రోజు ఉదయం ఫిల్మ్ ఛాంబర్ కాంపౌండ్లో మీడియాతో మాట్లాడుతూ "మా నాన్నగారు దాసరి నారాయణరావు గారు  చనిపోయే ముందు ఎలాంటి వీలునామా రాయలేదు. కాబట్టి ఆయన ఉన్న ఇంటి మీద మా అన్నయ్యకు, నాకు, మా చెల్లికి సమాన హక్కులు ఉన్నాయి. కాబట్టి నా ఇంటికి ఎలాగైనా వెళ్లే హక్కు నాకు ఉంది. కానీ మానసిక స్థితి సరిగా లేని కారణంగా మా అన్న ప్రభు గతంలో కూడా చాలాసార్లు ఇలా మీడియాకు ఎక్కడం... పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం చేశాడు. 
 
ఇప్పుడు కూడా నా డాక్యుమెంట్స్ తీసుకోవడానికి వెళితే ఇలా మీడియాకు ఎక్కి రభస చేశాడు. నా పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్నింటిలో అదే అడ్రస్ ఉంది. దానికితోడు నిన్న నాకు ఒక ముఖ్యమైన డాక్యుమెంట్ కొరియర్లో వస్తే దాన్ని కొరియర్ బోయ్ నుండి బలవంతంగా తీసుకున్నారు. కొరియర్ బోయ్ ఆ విషయం నాకు చెప్పగా అది తీసుకుందామని వెళితే ఇలా గొడవ చేసి 100కు డయల్ చేసి పోలీసులను పిలిపించాడు.
 
కొద్దిసేపటికే వచ్చిన జూబ్లీ హిల్స్ ఎస్ఐ నవీన్ గారు గట్టిగా ప్రశ్నించడంతో ఆ డాక్యుమెంట్స్ తెచ్చి ఇచ్చాడు. తాము ఫిర్యాదు చేయగా వచ్చిన పోలీసులే తమను గట్టిగా నిలదీయటంతో ప్రభు, అతని మామ అవి తిరిగి ఇచ్చారు. ఆ ఇంట్లో దాదాపు 15 మందికి పైగా ఎవరెవరో ఉన్నారు. సమయానికి పోలీసులు రావటం వారి కంటే మాకే ప్రొటెక్షన్ అయ్యింది. ఇదీ జరిగింది" అంటూ మొన్న రాత్రి జరిగిన సంఘటన పూర్వాపరాలను మీడియాకు వివరించారు దాసరి అరుణ్ కుమార్.
 
దాసరి గారి మరణం తరువాత అమ్మిన కొన్ని ఆస్తుల తాలూకు తన వాటా ఇవ్వకుండా మీరు మోసం చేశారని ప్రభు ఆరోపిస్తున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? అని ప్రశ్నిస్తే.. ఏం ఖర్మ... ఏకంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. అందుకు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అని పోలీసులు అడగటంతో మౌనంగా ఉండిపోయాడు. ఇలా సంవత్సరానికి ఒకటి రెండుసార్లు ఏదో ఒక వివాదంతో మీడియాకు ఎక్కడం, పోలీస్ కంప్లైంట్స్ ఇవ్వడం అతనికి మామూలైపోయింది.
 
ఈ వివాదాన్ని పరిష్కరించడానికి చిరంజీవి గారు ప్రయత్నిస్తున్నారని, అందుకు సి.కళ్యాణ్ గారిని పురమాయించారని చానళ్లలో వచ్చిన వార్త నిజమేనా?
అలాంటిదేమీ లేదండి... మరి ఆ వార్త ఎలా వచ్చిందో తెలీదు... మెగాస్టార్ చిరంజీవి గారిని ఇందులోకి లాగటం భావ్యం కాదు.
 
మోహన్ బాబు గారు, మురళీ మోహన్ గారు, సి.కళ్యాణ్ గారు ఇందులో జోక్యం చేసుకొని పరిష్కరించాలి అని ప్రభు అంటున్నారు... మీకు సమ్మతమేనా?
అంత పెద్దవాళ్ళు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినప్పుడు వాళ్ళ గౌరవాన్ని కాపాడాలి కదా... వాళ్ళు వచ్చి మా కోసం వెయిట్ చేసే పరిస్థితి కల్పించ కూడదు. గతంలో అలా చేయడంతో వాళ్ళు విసుగు చెంది వదిలేశారు. ఇప్పటికైనా వాళ్ళు జోక్యం చేసుకొని పరిస్థితిని చక్కదిద్దితే నేను కృతజ్ఞడినై ఉంటాను" అన్నారు దాసరి అరుణ్ కుమార్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్ 4 హోస్ట్ నాగార్జునా..? సమంతా..?