Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నల్లజాతీయుడి విలువ కేవలం 20 డాలర్లేనా? ఫిలోనిస్ ఫ్లాయిడ్

నల్లజాతీయుడి విలువ కేవలం 20 డాలర్లేనా? ఫిలోనిస్ ఫ్లాయిడ్
, గురువారం, 11 జూన్ 2020 (21:20 IST)
ఇటీవల అమెరికాలో నల్ల జాతీయుడైన జార్జి ఫ్లాయిడ్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్యతో అమెరికాలో జాతి అల్లర్లు చెలరేగాయి. ఈ హత్యపై జార్జి ఫ్లాయిడ్ సోదరుడు ఫిలోనిస్ ఫ్లాయిడ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. తన సోదరుడుని కేవలం 20 డాలర్ల కోసం హత్య చేయడం భావ్యమా అంటూ ప్రశ్నించాడు.
 
అంతేకాకుండా, పోలీసుల అదుపులో జార్జ్‌ ఫ్లాయిడ్‌ మరణించిన రెండు వారాల అనంతరం అమెరికా ప్రతినిధుల సభ జ్యుడిషియరీ కమిటీ తొలిసారి సమావేశమై విచారించింది. జార్జి ఫ్లాయిడ్ మరణంతో జాతి వివక్ష పెరిగిపోతోందంటూ అమెరికాలో నల్లజాతీయులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. గత కొన్నిరోజులుగా అమెరికా అంతటా నిరసనలు మిన్నంటుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో జార్జీ ఫ్లాయిడ్‌ మరణంపై విచారణ చేపట్టిన జ్యుడిషియరీ కమిటీ ఎదుట జార్జీ సోదరుడు ఫిలోనిస్‌ హాజరై తన వాదనలు వినిపించారు. తన సోదరుడు జార్జీ ఆ రోజు ఎవరినీ భాదించలేదు. కేవలం 20 డాలర్ల కోసమే ఆయనను చంపడం భావ్యమా? ఓ నల్లజాతీయుడి విలువ కేవలం 20 డాలర్లేనా?. 
 
జార్జీని చంపాల్సిన అవసరం పోలీసులకు ఏమున్నది?. సహకరించమని వేడుకొన్న కనికరించలేదు. ఆయన ఆవేదన ప్రస్తుతం అమెరికా అంతటా ప్రతిధ్వనిస్తున్నాయి. మీరూ వినండి అని చట్టసభ సభ్యుల ఎదుట చెప్పి కన్నీటి పర్యంతమయ్యారు. కాగా, గత నెల 25 న చనిపోయిన జార్జీ ఫ్లాయిడ్‌ అంత్యక్రియలు మంగళవారం హ్యూస్టన్‌లో పూర్తయ్యాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

16 నుంచి అసెంబ్లీ సమావేశాలు.. నోటిఫికేషన్ జారీ