Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 11 April 2025
webdunia

కామినేని శ్రీనివాస్ ఆవిష్కరించిన దర్జా టైటిల్ లుక్

Advertiesment
Sunil
, గురువారం, 21 అక్టోబరు 2021 (16:04 IST)
Kamineni Srinivas, sunil and others
సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో ఫిక్షన్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘దర్జా’. శ్రీ కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై  శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు. సలీమ్ మాలిక్ దర్శకత్వం వ‌హిస్తున్నాడు.  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రవి పైడిపాటి వ్యవహరించనున్నారు. తాజాగా ఈ చిత్ర టైటిల్ లుక్ పోస్టర్‌ను మాజీ హెల్త్ మినిస్టర్ కామినేని శ్రీనివాస్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘శివ శంకర్ నాకు అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉంటాడు. ఆయన నిర్మిస్తోన్న ‘దర్జా’ చిత్ర టైటిల్ లుక్ చాలా బాగుంది. ఈ చిత్రయూనిట్‌కు ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాను  అన్నారు.
 
దర్శక నిర్మాతలు మాట్లాడుతూ,  సీనియర్ నటీనటులు, నూతన నటీనటుల కలయికలో ఈ చిత్రం తెరకెక్కనుంది. హైదరాబాద్, భీమవరం, మచిలీపట్నం వంటి ప్రదేశాలలో షూటింగ్ జరపనున్నాం. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే ఈ చిత్రంలో సునీల్, అనసూయ పాత్రలు హైలెట్‌గా ఉంటాయి. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేయనున్నామ‌ని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యాక్ష‌న్ స‌న్నివేశాల్లో భీమ్లా నాయక్