అప్పుడెప్పుడో 2000 సంవత్సరంలో `చిత్రం` సినిమా తీసి తెలుగు చలనచిత్రరంగాన్ని ఒక ఊపు ఊపిన దర్శకుడు తేజ. ఆ తర్వాత పలు చిత్రాలు చేసి సక్సెస్ సాధించినా అనంతరం చేసిన కొన్ని సినిమాలు పెద్దగా ఆడలేదు. రూటు మార్చి రానాతో నేను రాజు నేనే మంత్రి అనే సినిమా తీశాడు. పర్వాలేదనిపించిది. ఆ తర్వాత కొంత గేప్ తీసుకున్న ఆయన ఇప్పటి ట్రెండ్‌కు తగినట్లు కథ రాసుకున్నారు. అయితే ఆ కథకు అనుకూలంగా చిత్రం సీక్వెల్‌గా సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. దానికి చిత్రం 1.1 అని పేరు పెట్టారు. ఈరోజు తేజ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ ను ప్రకటించారు.
అప్పటి కాంబినేషన్ అయిన సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ కూడా ఈ సినిమాలో పాలుపంచుకుంటున్నాడు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆ చిత్రంలో ఉయద్‌కిరణ్ హీరో. టీనేజ్ లవ్ స్టోరీ పేరుతో కాలేజీ చదువుతుండగా ఉదయ్‌కిరణ్, రీమా సేన్ ప్రేమించుకుంటారు. ఆమె గర్భంకూడా దాలుస్తుంది. ఈ కాన్సెప్ట్ అప్పుడు విమర్శలతోపాటు ట్రెండ్ ఇలా వుందనే కామెంట్లు వచ్చాయి. అయితే రానురాను ట్రెండ్ మారిన రీత్యా యూత్ సినిమాల పేరిట వింత పోకడలు వస్తున్న నేపథ్యంలో ఈసారి సీక్వెల్‌ను ఎలాంటి నటీనటులతో, ఎలాంటి కథతో తీస్తాడో కొద్దిరోజుల్లో తెలియనుంది.