Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వర్జినిటీ టెస్టు చేయించుకున్నాకే మహిళలు సినీ ఇండస్ట్రీలోకి రావాలా?: చిన్మయి (video)

వర్జినిటీ టెస్టు చేయించుకున్నాకే మహిళలు సినీ ఇండస్ట్రీలోకి రావాలా?: చిన్మయి (video)
, సోమవారం, 10 డిశెంబరు 2018 (16:11 IST)
మీటూ దక్షిణాదిన విప్లవంలా దూసుకెళ్లింది. మీటూ అనే ఉద్యమంపై తాను నోరు విప్పాక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నానని గాయని చిన్మయి చెప్పింది. తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పుకునేందుకు మహిళలు ముందుకు రావాలని చిన్మయి పిలుపు నిచ్చింది. అలా చేస్తేనే మార్పు అనేది సంభవిస్తుందని చిన్మయి వెల్లడించింది. 
 
వేధింపుల గురించి నోరు విప్పితే అదేదో వింతగా చూడటం.. ప్రముఖులు మీటూ నిందితులుగా వున్నారని చెప్తే.. మహిళలను హేళన చేయడం ఏమిటని గాయని ప్రశ్నించింది. ఇంకా నటుడు రాధారవిపై చిన్మయి మండిపడింది. 
 
రాధారవి ఓ స్టేజ్‌లో నోటికొచ్చినట్లు మాట్లాడితే.. ఆయనకు గౌరవం ఇస్తున్నారని.. అదే ఓ మహిళ నోరు విప్పితే ఆమెకు ఏవేవో కథలు కట్టేస్తున్నారని.. గాయని తెలిపింది. ఓ స్టేజ్‌లో రాధారవి.. సినిమాల్లోకి వచ్చే మహిళలు వర్జినీటి టెస్టు చేయించుకుని రావాలని.. అంటే అందరూ ఆయన వ్యాఖ్యలను తప్పు బట్టలేదని చిన్మయి మండిపడింది.
 
తప్పు జరుగుతుందని చెప్తే.. ఆ తప్పును సరిదిద్దకుండా ఫిర్యాదు చేసిన వారిని ఉద్యోగాల నుంచి తీసేయడం ఏమిటని.. చిన్మయి ప్రశ్నించింది. డబ్బింగ్ యూనియన్ నుంచి తనను కూడా ఇలాగే తొలగించారని ఆమె వెల్లడించింది. మీటూ తాను స్పందించడం వెనుక ఎవ్వరూ లేరని, తన వ్యాఖ్యలకు ఏ పార్టీకి ఏ మతానికి సంబంధం లేదని చిన్మయి స్పష్టం చేసింది. 
 
మహిళలు సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టేందుకు ముందు వర్జినిటీ టెస్టు చేయించుకోవాలని రాధారవి అంటే.. అది అవసరమా అంటూ అంత వినయంగా అందరూ అడుగుతున్నారని.. అదే ఓ మహిళ తనకు ఏర్పడిన చేదు అనుభవాల్ని తెలిపితే.. మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై స్పందిస్తే ఎందుకు తిరగబడుతున్నారని చిన్మయి ప్రశ్నించింది. 
 
అంతేగాకుండా.. సినీ ఇండస్ట్రీల్లోకి అడుగుపెట్టే మహిళలు వర్జినిటీ టెస్టు చేయించుకునే రావాలని రాధారవి అంటుంటే.. అంరూ పగలబడి నవ్వుతున్నారని... ఆయన వ్యాఖ్యలను ఎవ్వరూ తప్పుబట్టలేదని చిన్మయి నిలదీసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీదేవి కుమార్తెకు అరుదైన గౌరవం -- వరించిన ప్రతిష్టాత్మక అవార్డు