Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రజినీకాంత్ భార్యపై వివిధ సెక్షన్ల కింద చార్జిషీట్

Advertiesment
Rajinikanth
, ఆదివారం, 28 మార్చి 2021 (09:25 IST)
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సతీమణి లతా రజినీకాంత్‌పై వివిధ సెక్షన్ల కింద చార్జిషీటు ఒకటి దాఖలైంది. ఇది కూడా కర్నాటక రాష్ట్రంలో దాఖలైంది. గత 2014 మే 23వ తేదీన రజినీకాంత్ నటించిన "కొచ్చడియాన్" చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని మోషన్ క్యాప్చెరింగ్ టెక్నాలజీ విధానంలో యానిమేషన్ చిత్రంగా తెరకెక్కించారు. 
 
ఈ చిత్రానికి రజినీకాంత్ చిన్నకుమార్తె సౌందర్యా రజినీకాంత్ దర్శకత్వం వహించగా, మీడియావన్ గ్లోబెల్ ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై నిర్మించారు. అయితే, యాడ్ బ్యూరోకు మీడియా వన్ గ్లోబెల్ ఎంటర్‌టైన్మెంట్‌ తరపున లతా రజినీకాంత్ గ్యారెంటర్ సంతకం చేశారు. అయితే, యాడ్ బ్యూరోకు చెల్లించాల్సిన మొత్తాన్ని మీడియా వన్ ఇప్పటివరకు చెల్లించలేదు. దీంతో సాక్షి సంతకం పెట్టిన లతా రజినీకాంత్ ఆ మొత్తాన్ని చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
మీడియా వన్ సంస్థ నుంచి డబ్బులు వసూలు చేసి యాడ్ బ్యూరో సంస్థకు చెల్లించాల్సివుంది. కానీ, ఇది సాధ్యపడలేదు. దీంతో ఆమెపై యాడ్ బ్యూరో చట్టపరమైన చర్యలకు పూనుకుంది. ఈ కేసు ఇప్పటికే సుప్రీంకోర్టు వరకు వెళ్లగా, అక్కడ మూడు బెంచ్‌లలో లతా రజినీకాంత్‌కు చుక్కెదురైంది. పైగా, యాడ్ బ్యూరోకు చెల్లించాల్సిన 6.2 కోట్ల మొత్తాన్ని 2014 నుంచి వడ్డీతో కలిసి చెల్లించాలని అపెక్స్ కోర్టు కూడా ఆదేశాలు జారీచేసింది. 
 
కాగా, కొచ్చడియాన్ మొత్తం రూ.90 కోట్ల రెవెన్యూ సాధించింది పెట్టింది. దీనికి కారణం.. ఈరోస్ ఇంటర్నేషనల్ అనే సంస్థకు చిత్రాన్ని రెట్టింపు ధరకు విక్రయించారు. అదేసమయంలో యాడ్ బ్యూరోకు డబ్బులు చెల్లించకుండా ఒక నకిలీ లేఖను సృష్టించిన లతా రజినీకాంత్ బెంగుళూరు సిటీ సివిల్ కోర్టులో అఫిడవిట్ రూపంలో సమర్పించారు. 
 
దీనిపై విచారణ జరిపిన కరక్నాటక పోలీసులు.. లతా రజినీకాంత్ సమర్పించింది నకిలీ లేఖ అని తేల్చింది. దీంతో ఐపీసీ 196, 199, 463, 420, 34 సెక్షన్ల కింద లతా రజినీకాంత్‌కు విచారణ ఎదుర్కోవాలని కోర్టు ఆదేశించింది.  ఈ కేసులో ఈ నెల 27వ తేదీన చార్జిషీటును బెంగుళూరు నగరంలోని చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్టేర్ కోర్టులో దాఖలు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మ బ్లెస్సింగ్ లేకపోతే బయటకు వెళ్లనుః నాని.