Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Shiva Kandukuri: చాయ్ వాలా మొదటి సింగిల్ సఖిరే లిరికల్ విడుదలైంది

Advertiesment
Shiva Kandukuri, Teju Ashwini
Shiva Kandukuri, Teju Ashwini
రెండు హృదయాల కోసం రూపొందించిన మెలోడీ. చాయ్ వాలా మొదటి సింగిల్  సఖిరే లిరికల్ ఇప్పుడు విడుదలైంది. శివ కందుకూరి, తేజు అశ్విని పై చిత్రీకరించిన ఈ పాటను సురేష్ బనిశెట్టి రచించగా కపిల్ కపిలన్ గానం చేశారు. చిత్రాన్ని హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రాధా విజయలక్ష్మి, వెంకట్ ఆర్. పాపుడిప్పు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రమోద్ హర్ష రచన, దర్శకత్వం వహించారు.
 
ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో శివ కందుకూరి, రాజీవ్ కనకాల స్కూటీపై అలా జాలీగా తిరుగుతూ కనిపిస్తున్నారు. చూస్తుంటే అది హైదరాబాద్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించినట్టుగా కనిపిస్తోంది. ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో వారిద్దరి నవ్వుల్ని చూస్తుంటే ఆడియెన్స్‌ ఇట్టే కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది.
 
ఈ కథ ప్రేమ, వారసత్వం అనే అంశాల చుట్టూ తిరుగుతుంది. ఓ పర్ఫెక్ట్ చాయ్, కప్పులా ఉంటుంది. భావోద్వేగాలు, సంప్రదాయం, కలలతో నిండిన అద్భుతమైన ప్రయాణాన్ని చూసేందుకు సిద్ధంగా ఉండండి. టీజర్ అతి త్వరలో వస్తుంది’ అంటూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
 
ఈ మూవీకి ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం సమకూరుస్తుండగా, క్రాంతి వర్ల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. పవన్ నర్వా ఈ చిత్రానికి ఎడిటర్‌గా పని చేస్తున్నారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Rajendra Prasad: ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం నేనెవరు : డా: రాజేంద్ర ప్రసాద్