Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మోహ‌న్ బాబు వ్యాఖ్య‌ల‌పై సి.క‌ళ్యాణ్ స‌మాధానం

Advertiesment
Mohan Babu
C. Kalyan- mohabbabu
తెలుగు సినిమా రంగంలో దాస‌రి నారాయ‌ణరావు త‌ర్వాత ఎవ్వ‌రూ 24 శాఖ‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకున్న సంద‌ర్భాలు లేవు. ఆయ‌న త‌ర్వాత చిరంజీవి అనుకున్నారు. కానీ చిరంజీవి అందుకు సుముఖంగా లేరు. కానీ సి.క‌ళ్యాణ్ సౌత్ ఇండియా నిర్మాత‌ల‌మండి ప్రెసిడెంట్ కూడా చేశాడు. అందుకే ప‌లువురు ఆయ‌న‌వ‌ద్ద‌కు ప‌లు స‌మ‌స్య‌లు తీసుకువ‌స్తారు. తాజాగా మోహ‌న్‌బాబు వ్యాఖ్య‌లు ఆయ‌న గ‌మ‌నించారు.  సినిమా టికెట్ రేట్లు, ఆన్‌లైన్ వ్య‌వ‌హారంపై గ‌త కొంత‌కాలంగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.
 
ఇటీవ‌లే మోహ‌న్‌బాబు మాట్లాడుతూ, ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు.. నలుగురు డిస్ట్రిబ్యూటర్లు కాదని, అస్సలు నిర్మాతల మధ్య ఐక్యత లేదని వెల్ల‌డించారు. దీనిపై తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడు సి కల్యాణ్‌ స్పందించాల్సి వ‌చ్చింది. 
 
ఆయన మాట్లాడుతూ” మంచు మోహన్ బాబు గారి వ్యాఖ్యలను నేను వ్యతిరేకిస్తున్నాను.. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అన్ని సమస్యలపై ప్రభుత్వాలతో చర్చిస్తూనే ఉంది. మోహన్ బాబు గారు.. నిర్మాతలలో ఐక్యత లేదు అన్నారు. గుర్తుంచుకొని మీరు కూడా ఒక నిర్మాతే.. మీ కొడుకు విష్ణు కూడా ఒక నిర్మాతే.. మీ ఫ్యామిలీ అంతా సినిమా రంగంలోనే ఉంది. మా వల్ల కాదు అనుకుంటే మీరు ముందు ఉండి ఈ స‌మ‌స్య‌ను పరిష్కరించండి.. మీ వెనుకే మేము నిలబడతాం అని తెలిపారు. మ‌రి దీనికి మోహ‌న్‌బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీరూ ఒక నిర్మాతే... మీరు ముందుంటే మేము వెనకుంటాం.. సి.కళ్యాణ్