మన దేశంలో ఎదుటివారి మనోభావాలు ఊరికే దెబ్బతింటుంటాయి. ఇది జగమెరిగిన విషయమే. సినిమాలపరంగా అది మరింత ముందుకు సాగుతుంది. తాజాగా దేవ్ కట్టా దర్శకత్వంలో రూపొందిన రిపబ్లిక్ చిత్రంకూ ఆ సెగ తగిలింది. ఈనెల`న విడుదలైన ఈ సినిమాను అదేరోజు శ్రీకాకులంలో న్యూన్ షోను ప్రదర్శించకుండా ఆపారు. ఇప్పుడు కొల్లేరు సరస్సు ప్రాంతం చుట్టుపక్కల చెందిన కొంతమంది తమ మనోభావాలు దెబ్బతిన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రిపబ్లిక్ సినిమాలో తెల్లేరు పేరు పెట్టి చెరువుల వల్ల చేపల పెంపకం విషం చేస్తున్నారని దుష్ప్రచారం చేశారు. మా మనోభావాలు దెబ్బతిన్నాయి కనుక రిపబ్లిక్ సినిమాను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, కలెక్టర్ కార్తికేయ మిశ్రాకి కొల్లేరు గ్రామాల వాసులు వినతి పత్రం అందజేశారు.
ఇటీవలే ఈ సినిమాను చూసిన తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి, సీతక్క వంటివారు యూత్ ఈ సినిమాను చూడాలని. కొంతైనా మారాలి. అప్పుడే సమాజం మారుతుంది. ఇది ఏ ఒక్కరి గురించి తీయలేదంటూ వివరించారు. సాయిధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేశ్ నటించారు. సాయిధరమ్ తేజ్ ఐఏఎస్ అధికారిగా నటించి అవినీతి రాజకీయ నాయకులను ఎండగడతాడు.