Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రొఫెషనలిజం విషయంలో బాలీవుడ్ కొంచెం భిన్నంగా ఉంటుంది : సినిమాటోగ్రాఫర్ డడ్లీ

Advertiesment
cinematographer Dudley
, బుధవారం, 2 ఆగస్టు 2023 (18:28 IST)
cinematographer Dudley
‘దర్శకుడు మెహర్ రమేష్, నేను పదేళ్ళుగా మంచి స్నేహితులం. లాక్ డౌన్ పిరియడ్ లో ఓ రోజు కాల్ చేసి  కలసి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నామని చెప్పారు. హీరో ఎవరని అడిగాను. గెస్ చేయమని చెప్పారు. నేను ఏవో రెండు పేర్లు చెప్పాను. ‘మెగాస్టార్ చిరంజీవి గారు’ అని ఆయనే రివిల్ చేశారు. నాకు చాలా షాక్  అండ్ సర్ప్రైజ్ గా అనిపించింది. చాలా థ్రిల్ అయ్యాను. వెంటనే ముంబై నుంచి వచ్చి మిగతా వాటి గురించి చర్చించాం. అలా ఈ జర్నీ మొదలైయింది- అని సినిమాటోగ్రాఫర్ డడ్లీ అన్నారు. 
 
తమన్నా భాటియా కథానాయిక కాగ, చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇటివలే విడుదలైన ట్రైలర్ టాప్ ట్రెండింగ్ లో వుంది. ‘భోళా శంకర్’ ఆగస్టు 11న విడుదల కానున్న నేపధ్యంలో చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించిన డడ్లీ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
 
డడ్లీ అనేది మీ అసలు పేరా ? మీ నేపధ్యం గురించి చెప్పండి.
డడ్లీ నా ముద్దు పేరు. రాజేంద్ర అనేది నా అసలు పేరు. మాది తమిళనాడు ఊటీ. తమిళనాడులో ఫిలిం టెక్నాలజీ చదువుకున్నాను. తర్వాత ముంబైకి షిఫ్ట్ అయ్యాను.
 
మీరు బాలీవుడ్ లో చాలా మంది స్టార్స్ తో పని చేశారు. చిరంజీవి గారితో పని చేసినప్పుడు అక్కడికి ,ఇక్కడికి  ఎలాంటి తేడాని గమనించారు ?
 
చిరంజీవి గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన  ఎన్సైక్లోపీడియా. పర్ఫెక్షనిస్ట్. ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్. ఆయన పంక్చువాలిటీని ఎవరూ మ్యాచ్ చేయలరు. ఏడు గంటలకు షాట్ అని చెబితే మేకప్ తో సరిగ్గా ఏడు గంటలకు కెమెరా ముందు వుంటారు. క్యార్ వాన్ లో కూడా వెళ్లరు. నేరుగా సెట్స్ లోకి వస్తారు. పంక్చువల్  ప్రొఫెషనలిజం విషయంలో బాలీవుడ్ కొంచెం భిన్నంగా ఉంటుంది. సౌత్ ఇండస్ట్రీలో చాలా పంక్చువల్ గా వుంటారు.
 
ఇది వేదాలం చిత్రానికి రీమేక్ కదా.. ఆ చిత్రం నుంచి ఎలాంటి అంశాలని తీసుకున్నారు. ఎలాంటి మార్పులు చేశారు ? మీరు ఎలాంటి సూచనలు ఇచ్చారు ?
చిరంజీవి గారితో చర్చించి సమిష్టిగా నిర్ణయాలు తీసుకున్నాం. ఇది మెగాస్టార్ స్టయిల్ లో వుంటుంది. లుక్, టేకింగ్ పరంగా మెగాస్టార్ స్టయిల్ కి తగట్టు మార్పులు చేశాం. ఒరిజినల్ కంటే బెటర్ గా వుంటుంది.  
 
ఒక డీవోపీ గా రీమేక్ సినిమా కష్టమా ? సులువా ?
నిజం చెప్పాలంటే రీమేక్ సినిమా చాలా కష్టం. ఎందుకంటే ఒరిజినల్ ని మ్యాచ్ చేస్తే సరిపోదు దాని కంటే ప్రతి విషయంలోను ఒక అడుగు బెటర్ గా వుండాలి. ఇది బిగ్ ఛాలెంజ్.  అందుకే ఈ సినిమా విజువల్ విషయంలో చాలా జాగ్రత్తగా వున్నాం. ఖచ్చితంగా ఒరిజినల్ కంటే ఇది బెటర్ గా వుంటుంది.
 
భోళా శంకర్ లో మేకింగ్ పరంగా కష్టంగా అనిపించిన పార్ట్ ఏమిటి ?
ఇంటర్వెల్ సీక్వెన్స్ చాలా టఫ్ అనిపించింది. చాలా పెద్ద యాక్షన్ సీక్వెన్స్ పార్ట్ అది. వేదాలంలో చాలా చక్కగా తీశారు. దాన్ని మ్యాచ్ చేస్తూ ప్రజంటేషన్ పరంగా డిఫరెంట్ గా ఉండేలా చాలా గ్రాండ్ గా చేశాం. చాలా పెద్ద సెట్స్ వేశాం. సినిమా అంతా గ్రాండ్ గా విజువల్ ట్రీట్ గా వుంటుంది. వేదాలంకు ఒక అడుగు మందు వుంటుంది.
 
ఇందులో కొత్త టెక్నాలజీని ఉపయోగించారా ?
యాక్షన్ పార్ట్ కి కాంటాక్ట్ కెమరా వాడాం. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ మంచి యాక్షన్ ని డిజైన్ చేశారు. ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు చాలా సపోర్ట్ చేశారు. డే అండ్ నైట్ వర్క్ చేసి అద్భుతమైన సెట్స్ రెడీ చేశారు.
 
భోళా శంకర్ లో మెమరబుల్ మూమెంట్స్ ఏమిటి ?
మెగాస్టార్ గారితో ప్రతి క్షణం మెమరబుల్ గా వుంటుంది. ఈ సినిమా చేస్తున్నప్పుడు ఎలాంటి ఒత్తిడి లేదు. మెగాస్టార్ గారి టైమింగ్ అద్భుతంగా వుంటుంది. ముఖ్యంగా కామెడీ టైమింగ్ అవుట్ స్టాండింగ్. ఆయనకి టెక్నికల్ అంశాలపై కూడా అపారమైన పట్టు వుంది. యాక్షన్ సీన్స్ ఫెంటాస్టిక్ గా చేశారు. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు.
 
నిర్మాతల నుంచి ఎలాంటి ప్రోత్సాహం వుండేది ?
ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ వండర్ ఫుల్ ప్రొడ్యూసర్స్. సినిమాకి కావాల్సిన ప్రతిది ఎక్కడా రాజీపడకుండా సమకూర్చారు. చాలా గ్రాండ్ గా నిర్మించారు. కలకత్తా, స్విట్జర్లాండ్ లో కూడా చిత్రీకరణ జరిపాం. యాక్షన్, సాంగ్స్ అద్భుతంగా వుంటాయి. భోళా శంకర్  ఫుల్ ప్యాకేజీ ఆఫ్ మాస్ ఎంటర్ టైనర్. కన్నుల పండగలా వుంటుంది.
 
మెగాస్టార్, తమన్నా, కీర్తి సురేష్ లాంటి స్టార్స్ తో మీ మొదటి తెలుగు సినిమా చేయడం ఎలా అనిపించింది ?
ఈ జర్నీ చాలా సరదాగా జరిగింది. మెగాస్టార్, తమన్నా, కీర్తి సురేష్ లాంటి స్టార్స్ తో వర్క్ చేయడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. పాటలు చాలా బాగా వచ్చాయి. శేఖర్ మాస్టర్ చక్కగా కొరియోగ్రఫీ చేశారు. ఇందులో యంగెస్ట్ వెర్షన్ ఆఫ్ మెగాస్టార్ ని చూస్తారు.
 
ఒక డీవోపీగా మెగాస్టార్ నుంచి ఎలాంటి విషయాలు నేర్చుకున్నారు ?
మెగాస్టార్ నుంచి ప్రతి రోజు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకున్నాను. ఆయనది గొప్ప ప్రయాణం. ఆ ప్రయాణంలోని ఎన్నోమంచి విషయాలు పంచుకున్నారు. ఆయన పెర్ ఫెక్షనిస్ట్, చాలా పంక్చువల్. ఈ రెండు విషయాలు ఆయన నుంచి నేర్చుకున్నాను.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలీవుడ్ నాకు పొరుగు ఇల్లు - టాలీవుడ్ లో అవి నచ్చక వదిలేస్తున్నా : జేడీ చక్రవర్తి