Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వ్యక్తి మరణానికి కారణమైన 'హేట్ స్టోరీ-3' హీరోయిన్

Advertiesment
వ్యక్తి మరణానికి కారణమైన 'హేట్ స్టోరీ-3' హీరోయిన్
, గురువారం, 13 డిశెంబరు 2018 (11:08 IST)
జరీన్ ఖాన్.. బాలీవుడ్ హీరోయిన్. 'హేట్‌స్టోరీ-3', 'హౌజ్‌ఫుల్-2', 'వీర్' వంటి చిత్రాల్లో నటించింది. ఇపుడు ఈమె ఓ వ్యక్తి మరణానికి కారణమైంది. ఈ వివరాలను పరిశీలిస్తే, నార్త్‌గోవా బీజ్ విలేజ్‌లోని అంజ‌నా అనే ప్రాంతంలో ఓ వ్యక్తి బైక్‌పై వెళుతుండగా, వెనుక నుంచి వచ్చిన జ‌రీన్ ఖాన్ కారు ఆ వ్య‌క్తి బైక్‌ని ఢీకొట్టింది. 
 
ఈ ప్రమాదంలో ఆ వ్య‌క్తి డివైడ‌ర్‌ని ఢీకొన‌గా త‌ల‌కి తీవ్ర గాయ‌మైంది. వెంట‌నే జ‌రీన్‌ఖాన్, ఆమె అనుచరులు క్షతగాత్రుడుని తక్షణమే ఆస్పత్రికి తరలించారు. అయితే, త‌ల‌కి బ‌ల‌మైన గాయంకావ‌డంతో ఆయ‌న మృతి చెందిన‌ట్టు పోలీసులు తెలిపారు. ప్ర‌స్తుతం ఈ యాక్సిడెంట్‌కి సంబంధించి కేసు న‌మోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
కాగా, జరీన్ ఖాన్ హిందీతో పాటు ప‌లు త‌మిళ, పంజాబీ చిత్రాల‌లో కూడా న‌టించింది. ఈ మ‌ధ్య త‌న మాజీ మేనేజ‌ర్ త‌ప్పుగా ప్ర‌వ‌ర్తిస్తున్నాడ‌ని కేసు పెట్టి హాట్ టాపిక్‌గా నిలిచింది. ఫోన్ ద్వారా త‌ప్పుడు మేసేజ్‌లు కూడా పంపిస్తున్నాడంటూ త‌న ఫిర్యాదులో పేర్కొంది. ప్ర‌స్తుతం ఈ కేసు విచార‌ణ‌లో ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్టెప్పులతో కాకపుట్టించిన బార్బీగర్ల్ కత్రినా కైఫ్ (Video)