Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీసింహా కోడూరి హీరోగా భాగ్ సాలే - ప్రారంభం

Advertiesment
శ్రీసింహా కోడూరి హీరోగా భాగ్ సాలే  - ప్రారంభం
, సోమవారం, 25 అక్టోబరు 2021 (20:32 IST)
Suresh babu, keeravani, simha and others
సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహ కోడూరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “భాగ్ సాలే”. ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం సోమవారం ఉదయం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. నిర్మాత సురేష్ బాబు కెమెరా స్విచ్ఛాన్ చేయగా, దర్శకుడు హరీష్ శంకర్ ఫస్ట్ షాట్ కు క్లాప్ కొట్టారు.
 
సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి సురేష్ బాబు సమర్పణలో బిగ్ బెన్ సినిమా, సినీ వ్యాలీ మూవీస్ సంస్థలు సంయుక్తంగా “భాగ్ సాలే” చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. యష్ రంగినేని, శింగనమల కళ్యాణ్ నిర్మాతలు. దర్శకుడు ప్రణీత్ బ్రహ్మాండపల్లి రూపొందిస్తున్నారు.
 
“మత్తు వదలరా”, “తెల్లవారితే గురువారం” చిత్రాల తర్వాత శ్రీ సింహ నటిస్తున్న మూడో చిత్రమిది. క్రైమ్ కామెడీ జానర్ లో తెరకెక్కుతున్న “భాగ్ సాలే” ఈ చిత్రానికి కీరవాణి మరో తనయుడు కాలభైరవ సంగీతాన్ని అందిస్తున్నారు.
 
జాన్ విజయ్, రాజీవ్ కనకాల, వెన్నెల కిషోర్, నందినీరాయ్, సుదర్శన్, వంశీ నెక్కంటి, వైవా హర్ష, కిడ్ చక్రి, జయవాణి, బాష, యాదం రాజు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
 
చిత్రానికి ఎడిటింగ్ – సత్య గిడుటూరి, సినిమాటోగ్రఫీ – సుందర్ రామ్ కృష్ణన్, ప్రొడక్షన్ డిజైనర్ - శృతి నూకల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అశ్వత్థామ - , సాహిత్యం - శ్రీజో, ఫైట్స్ - రామకృష్ణ, కాస్ట్యూమ్స్ - రాగ రెడ్డి, కాస్ట్యూమర్ - కృష్ణ, మేకప్ -బాబు, పీఆర్వో – జీఎస్కే మీడియా, సమర్పణ - డి సురేష్ బాబు, నిర్మాతలు -యష్ రంగినేని, శింగనమల కళ్యాణ్, రచన, దర్శకత్వం - ప్రణీత్బ్ర హ్మాండపల్లి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజ‌య్‌కు న‌ల‌భై మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారుః ఆనంద్ దేవరకొండ