Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలయ్య-బోయపాటి కాంబో మూవీకి రంగం సిద్ధం.. ఎప్పుడంటే?

నంద‌మూరి న‌ట సింహం బాలకృష్ణ కెరియర్లో ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేని చిత్రాలు సింహా, లెజెండ్. ఈ రెండు సినిమాలకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. దీంతో బాలకృష్ణతో బోయ‌పాటికి ఎంతో సాన్నిహిత్యం వుంది. ఈ నేపథ్య

Advertiesment
బాలయ్య-బోయపాటి కాంబో మూవీకి రంగం సిద్ధం.. ఎప్పుడంటే?
, బుధవారం, 23 మే 2018 (12:29 IST)
నంద‌మూరి న‌ట సింహం బాలకృష్ణ కెరియర్లో ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేని చిత్రాలు సింహా, లెజెండ్. ఈ రెండు సినిమాలకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. దీంతో బాలకృష్ణతో బోయ‌పాటికి ఎంతో సాన్నిహిత్యం వుంది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా రూపొందించేందుకు ఎప్ప‌టి నుంచో ప్లాన్ చేస్తున్నారు.
 
ఈ సినిమా పూజా కార్యక్రమాలను వచ్చేనెల మొదటివారంలో జరపాలనే నిర్ణయానికి బాలకృష్ణ .. బోయపాటి వచ్చినట్టుగా సమాచారం. ఎన్టీఆర్ బయోపిక్ .. బాలకృష్ణ సొంత బ్యానర్లో రూపొందనుందనే సంగతి తెలిసిందే. అదే బ్యానర్లో బోయపాటి సినిమా వుండనుందని అంటున్నారు.
 
ప్రస్తుతం వినాయక్‌తో కలిసి సెట్స్ పైకి వెళుతోన్న బాలకృష్ణ, ఆ తరువాత ఎన్టీఆర్ బయోపిక్‌ను చేయనున్నాడు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తరువాత బోయపాటితో రెగ్యులర్ షూటింగుకి వెళ్లనున్నట్టు చెబుతున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి. జూన్ 10న బాల‌య్య పుట్టిన‌రోజు. ఆరోజే బోయ‌పాటి తో సినిమాను ఎనౌన్స్ చేయ‌నున్నార‌ని స‌మాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహానటికి కాసుల వర్షం.. ప్రపంచవ్యాప్తంగా రూ.30కోట్ల కలెక్షన్లు