Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలుగులో వ‌స్తోన్న బడవ రాస్కెల్

Advertiesment
Badava Rascal
Dhanunjay, Amrita Iyengar
కన్నడలో బ్లాక్ బస్టర్ అయిన బడవ రాస్కెల్ చిత్రం ఇప్పుడు తెలుగులో విడుదల అవడానికి సిద్ధమవుతుంది. డాలీ పిక్చర్స్ మరియు రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ వారు సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. తెలుగులో పలు విజయవంతమైన సినిమాలను చేసి గుర్తింపు సంపాదించుకున్న రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ ఈ బ్లాక్ బస్టర్ సినిమా అందిస్తుండడం విశేషం.  
 
తెలుగు లో భారీ విజయం సొంతం చేసుకున్న పుష్ప సినిమాలో జాలిరెడ్డి పాత్ర తో ప్రేక్షకులను అలరించిన ధనుంజయ్ ఈ సినిమా లో హీరో గా నటించగా అమృత అయ్యంగార్ హీరోయిన్ గా నటించింది. శ్రీమతి గీత శివరాజ్ కుమార్ సమర్పణలో ని ఈ సినిమాను శ్రీమతి సావిత్రమ్మ అడవి స్వామి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. శంకర్ గురు దర్శకత్వం వహించారు. తొందరలోనే ఈ సినిమా కు సంబందించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.
 
నటీనటులు : ధనుంజయ్, అమృత అయ్యంగార్
 
సాంకేతిక నిపుణులు : సమర్పణ : శ్రీమతి గీత శివరాజ్ కుమార్,  నిర్మాత : సావిత్రమ్మ అడవి స్వామి,  దర్శకుడు : శంకర్ గురు, కో ప్రొడ్యూసర్ : ఖుషి, సినిమాటోగ్రఫీ : ప్రీతా జయరామన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రమణారెడ్డి & దేవన్ గౌడ,  మాటలు - సాహిత్యం : రామ్ వంశీకృష్ణ.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రామానుజ పార్థివదేహం శ్రీరంగంలో ఇంకా ఉంది - లయన్ సాయి వెంకట్