Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇండిగో విమానంలో ప్రయాణం వద్దంటున్న నటి ఈషా రెబ్బ... ఎందుకో?

విమాన ప్రమాణికులు ఎప్పుడూ ఇండిగో ఫ్లైట్‌లో ట్రావెల్ చేయొద్దని అంటుంది హీరోయిన్ ఈషా రెబ్బ. ఇండిగో ఫ్లైట్‌తో చాలాసార్లు ఇబ్బంది పడ్డానని, విసుగొచ్చిందంటూ ట్విట్టర్‌లో నెటిజన్ కామెంట్స్‌కి రిప్లై ఇచ్చింది. ట్విటర్‌లో ఇండిగో ఫ్లైట్ కారణంగా తాను పడిన బాధన

Advertiesment
ఇండిగో విమానంలో ప్రయాణం వద్దంటున్న నటి ఈషా రెబ్బ... ఎందుకో?
, బుధవారం, 5 సెప్టెంబరు 2018 (13:43 IST)
విమాన ప్రమాణికులు ఎప్పుడూ ఇండిగో ఫ్లైట్‌లో ట్రావెల్ చేయొద్దని అంటుంది హీరోయిన్ ఈషా రెబ్బ. ఇండిగో ఫ్లైట్‌తో చాలాసార్లు ఇబ్బంది పడ్డానని, విసుగొచ్చిందంటూ ట్విట్టర్‌లో నెటిజన్ కామెంట్స్‌కి రిప్లై ఇచ్చింది. ట్విటర్‌లో ఇండిగో ఫ్లైట్ కారణంగా తాను పడిన బాధను ఓ నెటిజన్ వెల్లడించాడు. 
 
‘‘ఇండిగో కారణంగా నేను ఫ్లైట్ మిస్ అవడం వారంలో ఇది రెండోసారని ఇండిగో ఉద్యోగుల ఈగో కారణంగా ఇది జరిగింద''ని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌ని చూసిన ఈషారెబ్బ తీవ్రంగా స్పందించింది. ‘‘మీరు చెప్పింది నిజం. నేను కూడా ఇలాంటి ప్రాబ్లమ్‌నే ఇండిగో కారణంగా చాలాసార్లు ఫేస్ చేశాను. 
 
దీంతో నేను ఇండిగో ఫ్లైట్‌లో ఎప్పుడూ ప్రయాణించకూడదని నిర్ణయించుకున్నా"నని పేర్కొంది. అంతేకాదు... ఎవరూ ఇండిగో ఫ్లైట్‌లో ప్రయాణించవద్దని నేను ప్రతి ఒక్కరినీ అర్థిస్తున్నానంటూ ‘నెవర్ ఫ్లై ఆన్ ఇండిగో, అవాయిడ్ ఇండిగో’ అనే ట్యాగ్ లైన్ జత చేసింది ఈషా రెబ్బా. మరి ఆమెను అంతగా అసౌకర్యానికి ఇండిగో ఫ్లైట్ సిబ్బంది ఏం చేశారబ్బా?

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అంజలిని దురదృష్టం వెంటాడుతుందా?