దర్శకుడు క్రిష్, అనుష్క శెట్టి కాంబినేషన్ లో వచ్చిన ఘాటీ సినిమా ఫలితం తెలిసిందే. ఆ చిత్రాన్ని దర్శకుడు సరిగ్గా తీయలేకపోయాడనీ, అనుష్క అసలు పబ్లిసిటీకి రాలేదని ఇదేమా ఆమె నేర్చుకుంది అంటూ సోషల్ మీడియాలో గత కొద్దిరోజులుగా ప్రచారాలు జరిగాయి. క్రిష్ స్టామినీ తగ్గిందనీ, అందుకు నిదర్శనం హరిహరమీరమల్లు చిత్రమే కారణంగా మరికొందరు పేర్కొన్నారు.
ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాల్లో చేతిరాతతో రాసిన ఒక నోట్‌ను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. బ్లూ లైట్ నుంచి క్యాండిల్ లైట్‌కు మారుతున్నా. స్క్రోలింగ్‌కు అతీతంగా ఉన్న ప్రపంచంతో, మనం నిజంగా మొదలైన చోటుతో తిరిగి కనెక్ట్ అయ్యేందుకు సోషల్ మీడియా నుంచి కొంతకాలం తప్పుకుంటున్నాను అని అనుష్క తన నోట్‌లో పేర్కొన్నారు. మరిన్ని కథలతో, మరింత ప్రేమతో త్వరలోనే మళ్లీ కలుస్తానని, ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని అభిమానులకు సందేశమిచ్చారు.
ఘాటి సినిమా ఫలితంపై సినిమా ఇండస్ట్రీ కూడా పెద్దగా స్పందించలేదు. దానితో కూడా దర్శకుడు క్రిష్ కొంచెం నిరాశకు గురయినట్లు తెలుస్తోంది. కాగా, సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆమె మాట్లాడినట్లు ఆడియో విడుదలైంది. అందులో నాకు పూర్తి స్థాయి నెగెటివ్ పాత్ర చేయాలని ఉంది. బలమైన కథ వస్తే తప్పకుండా విలన్‌గా నటిస్తాను అని చెప్పింది. త్వరలో మరో కథతో వస్తున్నట్లు చెబుతూ.. కొద్ది కాలం సోషల్ మీడియాకు దూరంగా వున్నట్లు చెబుతోంది.