Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'రంగమ్మత్త'గా హాట్ యాంకర్.. నెటిజన్లు 'ఫిదా'

రంగమ్మత్తగా హాట్ యాంకర్ అనసూయ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ 'జబర్దస్త్' భామ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది. దీనికి కారణం లేకపోలేదు.

Advertiesment
Anasuya
, సోమవారం, 19 మార్చి 2018 (15:54 IST)
రంగమ్మత్తగా హాట్ యాంకర్ అనసూయ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ 'జబర్దస్త్' భామ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది. దీనికి కారణం లేకపోలేదు. 
 
ఇటీవల ఓ బాలుడు ఈ హాట్ యాంకర్‌తో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించగా, అతని సెల్‌ఫోన్ లాక్కొని పగలగొట్టి, దుర్భాషలాడిన విషయం తెల్సిందే. దీనిపై ఆ పిల్లోడి తల్లి కూడా అనసూయపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం అప్పట్లో పెను వివాదాస్పదమైంది.
 
ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్ కాగా పలువురు నెటిజెన్లు ఆమె వ్యవహారశైలిపై విరుచుకుపడ్డారు. సదరు మహిళ తనపై దుష్ప్రచారం చేస్తోందంటూ అనసూయ చెప్పినప్పటికీ... నెటిజెన్ల దాడి కొనసాగింది. దీంతో, కొంతకాలం పాటు ట్విట్టర్, ఫేస్‌బుక్‌కు దూరంగా ఉంటున్నట్టు అనసూయ ప్రకటించింది. ఫిబ్రవరి 6వ తేదీన తన అకౌంట్లను డిజేబుల్ చేసింది.
 
ఈ నేపథ్యంలో ఆమె తాజాగా రీఎంట్రీ ఇచ్చింది. ఫేస్‌బుక్ ఖాతాను ఆదివారం యాక్టివేట్ చేసి, 'రంగస్థలం' ట్రైలర్‌ను అప్‌లోడ్ చేసింది. ట్విట్టర్ అకౌంట్‌ను ఈ రోజు యాక్టివేట్ చేసిన అనసూయ... 'రంగస్థలం'లో తాను పోషించిన రంగమ్మత్త ఫొటోను పోస్ట్ చేసింది. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు ఫిదా అయిపోయి, తమకుతోచిన విధంగా కామెట్స్ పెడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిట్టిబాబు మరింత దగ్గరయ్యాడు.. జగపతి బాబు పాత్ర సూపర్ : రాజమౌళి