Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోలీవుడ్ ఓ ఫేక్ ఇండస్ట్రీ ... కంటెంట్ కాదు.. ఇంకేదో ఆశిస్తారు : అమలాపాల్

కోలీవుడ్ ఓ ఫేక్ ఇండస్ట్రీ ... కంటెంట్ కాదు.. ఇంకేదో ఆశిస్తారు : అమలాపాల్
, బుధవారం, 24 అక్టోబరు 2018 (13:01 IST)
మలయాళ కుట్టి అమలాపాల్. చిన్నవయసులోనే దర్శకుడు విజయన్‌ను పెళ్లి చేసుకుని ఆ తర్వాత విడాకులు తీసుకుంది. అలా వార్తల్లో నిలిచింది. అలాంటి అమలాపాల్ ఇపుడు తమిళ సినీ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా, కోలీవుడ్ ఓ ఫేక్ ఇండస్ట్రీ అంటూ వ్యాఖ్యలు చేసింది. పైగా, తమిళ ప్రేక్షకులకు సినిమాలో కంటెంట్ ఉంటే సరిపోదని ఇంకేదో ఆశిస్తారంటూ వ్యాఖ్యానించింది.
 
నిజానికి తమిళ ప్రజలతో అమలా పాల్‌కు చిన్నవయసు నుంచే మంచి సంబంధం ఉంది. ఈమె టీనేజ్‌లో ఉండగా, మామ - కోడలు మధ్య అక్రమ సంబంధం నేపథ్యంలో నడిచే 'సింధు సమవేలి' అనే వివాదాస్పద సినిమాలో నటించింది. ఈ సీరియల్ తమిళ ప్రేక్షకుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఎదుర్కొంది. ఆ తర్వాత అద్భుతమైన పాత్రలతో అందరి ప్రశంసలూ అందుకుంటోంది. అలా తనను తిట్టిన నోళ్లతోనే పొగిడేలా చేసుకుంది. 
 
తాజాగా ఆమె తనకు అవకాశాలిస్తున్న తమిళ సినీ ఇండస్ట్రీ మీదే విమర్శలు గుప్పించింది. కోలీవుడ్ ఒక ఫేక్ ఇండస్ట్రీ అనేసింది. గత ఏడాది విడుదలైన తన సినిమా 'తిరుట్టు పయలే-2' ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ ఆమెను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీంతో ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఈ తరహా వ్యాఖ్యలు చేసింది. 
 
వాస్తవానికి పుష్కరం కిందట వచ్చిన 'తిరుట్టు పయలే' చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన చిత్రమే 'తిరుట్టు పయలే-2'. విలన్.. క్యారెక్టర్ రోల్స్ చేసే బాబీ సింహా హీరోగా నటించాడు. అమల అతడి భార్యగా నటించింది. మంచి థ్రిల్లర్ అయిన ఈ చిత్రం యావరేజ్‌గా ఆండింది. అయితే ఈ చిత్రంలో పెద్ద హీరోతో పాటు కొంచెం కమర్షియల్ అంశాలుంటే ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేదని అభిప్రాయపడింది. పైగా, ఇతర భాషల్లో కంటెంట్ ఉంటే చిన్న సినిమాలు కూడా పెద్ద విజయం సాధిస్తాయని.. తమిళంలో అలా కాదని.. ఇంకేదో ఆశిస్తారనీ, అందుకే ఇది ఫేక్ ఇండస్ట్రీ అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సముద్రంలో తలలేని వింతజీవి.... హడ్‌లెస్ చికెన్‌గా పేరు