Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 24 April 2025
webdunia

చిన్మయి.. అప్పుడెందుకు వైరముత్తును పొగిడావ్.. పద్మాసిని వైన్ తాగి..?

హాలీవుడ్‌ నుంచి భారత్‌కు వచ్చిన మీటూ ఉద్యమం ఉప్పెనలా ఎగసిపడుతోంది. సినీ రంగం నుంచి పలు రంగాలకు విస్తరిస్తోంది.

Advertiesment
Chinmayi
, మంగళవారం, 16 అక్టోబరు 2018 (18:13 IST)
హాలీవుడ్‌ నుంచి భారత్‌కు వచ్చిన మీటూ ఉద్యమం ఉప్పెనలా ఎగసిపడుతోంది. సినీ రంగం నుంచి పలు రంగాలకు విస్తరిస్తోంది. ప్రముఖుల వికృత చేష‌్టలు ఈ ఉద్యమం ద్వారా బయటపడుతున్నాయి. మాజీ నటి తనుశ్రీ దత్తా అందించిన స్పూర్తితో భారతదేశంలో మీ టూ ఉద్యమం ఊపందుకుంది. ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ట్విట్టర్‌లో పోస్టు చేస్తున్న సందేశాలు కోలీవుడ్‌లో కలకలం రేపుతున్నాయి. 
 
మనవరాలి వయసులో ఉన్నప్పుడే తనను లైంగికంగా వేధించారంటూ తమిళ సినీ దిగ్గజం, ప్రముఖ గేయ రచయిత వైరముత్తుపై తీవ్ర ఆరోపణలు చేసింది. తన కుమార్తె చిన్మయి సినీ పరిశ్రమలో ఎదుర్కొన్న లైంగిక వేధింపులపై ఆమె తల్లి పద్మాసిని కూడా స్పందించారు. 
 
2004లో జరిగిన ఘటనను గుర్తు చేసుకుంటూ, తాము ఓ చిత్రం ఆడియో ఫంక్షన్ కోసం స్విట్జర్లాండ్ వెళ్లామని, కార్యక్రమం ముగిసిన తరువాత అందరినీ పంపించిన నిర్వాహకులు తమను అక్కడే వుంచి.. చిన్మయిని మాత్రం వైరముత్తు గదిలోకి రమ్మనాల్సిందిగా పిలుపు వచ్చిందన్నారు. 
 
హోటల్‌కు చిన్మయి ఎందుకు ఒంటరిగా వెళ్లాలి. ఏదైనా వృత్తి పరమైన విషయాలు మాట్లాడాలంటే ఊరికి వెళ్లాక మాట్లాడుకోవచ్చు. ఎందుకీ రహస్య కలయిక అని అడిగాను. అందుకు అతను వైరముత్తుకు కాస్త సహకరించండి అని బహిరంగంగానే అన్నాడు. అందుకు వేరేవారిని చూసుకోండని చెప్పి అక్కడి నుంచి వచ్చేశామని చిన్మయికి మద్దతుగా నిలిచారు. 
 
ఈ నేపథ్యంలో చిన్మయిపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. సుచీలీక్స్ సందర్భంగా నాలుగు సార్లు గర్భస్రావం చేసుకున్నావని లీక్స్ చెప్పిందని.. అలాంటి సమయంలో ఎందుకు స్పందించలేదని అడుగుతున్నారు. అంతేగాకుండా.. ప్రస్తుతం ఆరోపణలు చేస్తున్న వైరముత్తును కొనియాడుతూ.. చిన్మయి చేసిన ట్విట్టర్ పేజీలను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. 
 
13 ఏళ్ల క్రితం వైరముత్తు తనను వేధింపులకు గురిచేశాడని చిన్మయి ఆరోపించింది. అయితే కొన్నేళ్ల క్రితం వైరముత్తును ప్రశంసిస్తూ.. పలు పోస్టులు చేసింది. 2014వ సంవత్సరం వైరముత్తు పద్మభూషణ్ అందుకున్న సందర్భంగా కితాబిస్తూ.. చిన్మయి ఇచ్చిన ట్వీట్లను నెటిజన్లు రీ పోస్టులు చేస్తూ ఏకిపారేస్తున్నారు.
 
ఇదిలా ఉంటే.. చిన్మయికి బాసటగా నిలిచిన ఆమె తల్లి పద్మాసిని తప్పతాగి చిందులేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. చిన్మయిని సహకరించాల్సిందిగా కోరిన అదే స్విజ్‌ సంగీత కచేరీలో పద్మాసిని వైన్ తాగి.. చేసిన హంగామా అంతా ఇంతా కాదని ఆ ప్రోగ్రామ్ ఆర్గనైజర్ ఇనియవన్ తెలిపారు. 
 
అంతేకాదు.. పద్మాసిని చేసిన హంగామాకు గాయకులు పారిపోయారని.. అక్కడున్న వారంతా తలపట్టుకున్నారని ఇనియవన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సజిత్ ఖాన్ నా దుస్తులను తొలగించమన్నాడు.. శరీరం చూడాలన్నాడు..