Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇండియన్ మైఖేల్ జాక్సన్ అంటే అమితమైన ఇష్టం : సాయేషా సైగల్

సాయేషా సైగల్.. టాలీవుడ్‌కు పరిచయమైన కొత్త హీరోయిన్. టాలీవుడ్ కుర్ర హీరో అఖిల్ అక్కినేని తొలి చిత్రం అఖిల్ సినిమా ద్వారా ఈమె సినీ వెండితరకు పరిచయమైంది. వివి.వినాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస

Advertiesment
Sayesha Saigal
, శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (14:10 IST)
సాయేషా సైగల్.. టాలీవుడ్‌కు పరిచయమైన కొత్త హీరోయిన్. టాలీవుడ్ కుర్ర హీరో అఖిల్ అక్కినేని తొలి చిత్రం అఖిల్ సినిమా ద్వారా ఈమె సినీ వెండితరకు పరిచయమైంది. వివి.వినాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. ఆ తర్వాత హీరోయిన్‌కే కాదు.. హీరోకు కూడా పెద్దగా అవకాశాలు రాలేదు.
 
దీంతో సాయేషా కోలీవుడ్‌లో ప్రయత్నాలు చేయగా, అవి ఫలితాన్నిచ్చాయి. ఫలితంగా అక్కడ ఆమె ఓ రేంజ్‌లో దూసుకెళుతోంది. ఇక్కడ ఏకంగా అగ్రకథానాయకుల సరసన అవకాశాలు వరుసగా వచ్చిపడుతున్నాయి. సాధారణంగా బొద్దుగా వుండే కథానాయికలనే ఇష్టపడే తమిళ ప్రేక్షకులు.. అందుకు భిన్నంగా ఈ నాజూకు భామను ఆరాధిస్తూ ఉండటం విశేషం.
 
పైగా, ఈమె డాన్స్ కూడా బాగా వేస్తుందట. డాన్స్‌ను తాను బాగా చేయడానికి కారణం ప్రభుదేవా అనీ.. ఆయన స్ఫూర్తితోనే పది రకాల డాన్సులు నేర్చుకున్నానని సాయేషా చెబుతోంది. తనకి ప్రభుదేవా అంటే ఎంతో ఇష్టమనీ .. ఆయన దర్శకత్వంలో నటించాలని ఉందని అంది. గతంలో ఒకసారి ఆవకాశం వచ్చినా అది కార్యరూపం దాల్చలేదని చెప్పుకొచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టెన్ష‌న్ టెన్ష‌న్‌గా విజ‌య్ దేవ‌ర‌కొండ‌..! ఎందుకు?