తమిళ సినిమాలో ప్రస్తుతం వివాదాస్పద నటిగా పేరున్న నటి అమలా పాల్. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ''ఆడై'' సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.
ఆడై సినిమా ఈ నెల 19వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, ట్రైలర్, టీజర్‌లకు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాలో దుస్తులు లేకుండా అమలాపాల్ నటించడం వివాదాస్పదమైంది.
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా అమలాపాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. తాను నటి అవుతానని అనుకోలేదు. తనకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నాను.
నగ్నంగా నటించడం.. ఇంకా రమ్యతో లిప్ లాక్ కిస్ ఇవ్వడంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. రమ్యతో లిప్ లాక్ సన్నివేశం సినిమాలో లేదు. కానీ కామిని క్యారెక్టర్ కోసం తాను నగ్నంగా నటించాల్సి వచ్చింది.
కానీ రమ్యతో లిప్ లాక్ సీన్ కోసం చాలామంది తనను లెస్బియనా అని అడుగుతున్నారు. స్నేహితురాలికి లిప్ లాక్ ఇవ్వడం తప్పేముంది.. ఈ చిత్రంలో తాను లెస్బియన్‌గా నటించలేదని అమలాపాల్ క్లారిటీ ఇచ్చింది.
తన సినిమా కెరీర్‌లో ''మైనా'' తన మనస్సుకు బాగా నచ్చిందని.. ఆ క్యారెక్టర్‌గానే తాను మారిపోయానని చెప్పింది. అలాగే ప్రస్తుతం నటించిన ఆడై సినిమాలోని కామిని క్యారెక్టర్ అంటే తనకెంతో ఇష్టమని వెల్లడించింది.