Publish Date: Sat, 25 Apr 2026 (11:50 IST)
Updated Date: Sat, 25 Apr 2026 (11:51 IST)
సినీ సెలెబ్రిటీల కుమార్తెలకు కూడా వేధింపులు తప్పడం లేదు. తాజాగా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కుమార్తెను ఓ పోకిరి వేధించాడు. దీనిపై మహారాష్ట్ర పోలీసులు ఓ నిందితుడుని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర సైబర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ యశస్వి వెల్లడించారు.
తన కుమార్తె వేధింపులకు గురవుతున్నట్లు అక్షయ్ కుమారే స్వయంగా అధికారుల దృష్టికి తీసుకువచ్చారని ఆయన తెలిపారు. ఆమె ధైర్యంగా ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడం వల్లే నిందితుడిని పట్టుకోవడం సాధ్యమైందని అధికారులు పేర్కొన్నారు.గత యేడాది అక్టోబరు నెలలో ముంబై స్టేట్ పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన 'సైబర్ అవేర్‌నెస్ మంత్ 2025' కార్యక్రమానికి అక్షయ్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఆ సమయంలో సైబర్ క్రైమ్ గురించి మాట్లాడుతూ.. తమ ఇంట్లో జరిగిన ఘటనను వెల్లడించారు. తన కుమార్తె ఆన్‌లైన్‌లో గేమ్ ఆడుతున్న సమయంలో అపరిచితుడి నుంచి మెసేజ్ వచ్చిందని న్యూడ్‌ఫొటోలు పంపాలని అతడు సందేశం పంపాడని, ఈ విషయం తన కుమార్తె ఇంట్లో చెప్పడంతో సైబర్‌క్రైమ్‌ను ఆశ్రయించినట్లు తెలిపారు. పాఠశాల విద్యార్థులకు సైబర్ క్రైమ్‌పై అవగాహన కల్పించేలా సైబర్ ఎడ్యుకేషన్‌ను వీక్లీ సబ్జెక్ట్‌గా పెట్టాలని ఈసందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే.