Publish Date: Mon, 06 Apr 2026 (20:08 IST)
Updated Date: Mon, 06 Apr 2026 (20:09 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఓ దారుణం జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న కట్టుకున్న భార్యను భర్త హత్య చేశాడు. గత మార్చి నెల 27వ తేదీన కవిత (29) అనే మహిళ ఇంటి నుంచి వెళ్ళిపోయింది. దీనిపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
అయితే, కవిత తన ప్రియుడుతో కలిసి జడ్చర్లలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులను వెంటబెట్టుకుని తన భార్యను తీసుకొచ్చేందుకు భర్త సిద్ధారెడ్డి వెళ్ళాడు. అయితే, తన భార్యను హత్య చేయాలని ముందుగానే నిర్ణయించుకున్న సిద్ధారెడ్డి.. ఒక కత్తిని కొనుగోలు చేసి, పోలీసుల కంటపడకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆ తర్వాత భార్యను బుజ్జగించి తన వెంట తీసుకుని జహీరాబాద్‌కు బయలుదేరాడు.
మార్గమధ్యంలో సదాశివపేట నందికంది వద్దకు రాగానే పోలీసుల కళ్లెదుటే కత్తితో భార్య కవిత గొంతులో పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత కవిత మృతదేహాన్ని జహీరాబాద్ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి మార్చురీకి తరలించారు. ఈ హత్య కేసుకు సంబంధించి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.