Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సోనీ లివ్‌లో అఖిల్ అక్కినేని యాక్షన్-ప్యాక్డ్ గూఢచర్య థ్రిల్లర్ ‘ఏజెంట్’ ప్రత్యేక ప్రీమియర్

Akhil
, శనివారం, 23 సెప్టెంబరు 2023 (17:52 IST)
సోనీ లివ్‌ సగర్వంగా అఖిల్ అక్కినేని ఏజెంట్ ప్రత్యేక ప్రీమియర్‌ను ప్రకటించినందున, ఉత్తేజపూర్వకమైన సినిమాటిక్ కోలాహలం కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. థియేట్రికల్ విడుదల తర్వాత, ఈ స్పై-థ్రిల్లర్ మీ స్క్రీన్‌లను మరోసారి జ్వలింపజేయడానికి తిరిగి వస్తోంది 2023 సెప్టెంబర్ 29 నుండి సోనీ లివ్‌లో మాత్రమే.
 
ప్రశంసలు పొందిన చిత్రనిర్మాత సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన, ఏజెంట్ చిత్రం అంతా కూడా రికీ చుట్టూ తిరుగుతుంది. ఆయన ది డెవిల్ అని కూడా పిలువబడే రా (RAW) చీఫ్ కల్నల్ మహదేవ్ చేత సవాలుతో కూడిన మిషన్‌ను కేటాయించబడిన ఔత్సాహిక రా ఏజెంట్. భారతదేశాన్ని నాశనం చేయడా నికి ఒక క్రూరమైన ప్రణాళికను కలిగి ఉన్న రా మాజీ ఏజెంట్, ధర్మ అలియాస్ ది గాడ్‌ని పట్టుకోవడానికి రికీ ఓ బిగినర్‌గా చొరబడాలి. కానీ ఈ మిషన్ ఊహించని మలుపు తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది?
 
అఖిల్ అక్కినేని, మమ్ముట్టి, డినో మోరియా, సాక్షి వైద్య, డెంజిల్ స్మిత్, విక్రమ్‌జీత్ విర్క్ వంటి తారాగణంతో ఏజెంట్ సినిమా రూపుదిద్దుకుంది. పవర్-ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్‌‌లు ఇందులో ఉన్నాయి. దర్శకత్వం వహించడంతో పాటు, ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే సురేందర్ రెడ్డి రాశారు. దీనికి కథను ప్రముఖ రచయిత వక్కంతం వంశీ అందించారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై రామబ్రహ్మం సుంకర, అజయ్ సుంకర, పతి దీపారెడ్డి దీనిని నిర్మించారు.
 
సురేందర్ రెడ్డి, దర్శకుడు మాట్లాడుతూ..  “ఏజెంట్‌తో, మేం పట్టు సడలని కథనం, శక్తివంతమైన యాక్షన్, ఆకట్టుకునే పెర్ఫార్మెన్స్‌‌లను మిళితం చేసి లీనమయ్యే సినిమాటిక్ అనుభవాన్ని సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ ఉత్తేజపూరిత ప్రయా ణానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న చలనచిత్ర ఔత్సాహికులను నేరుగా స్క్రీన్‌ల వద్దకు తీసుకురావడానికి సోనీ లివ్‌తో భాగస్వామి అయినందుకు మేం సంతోషిస్తున్నాం. కొన్ని ట్విస్టులు, సస్పెన్స్‌‌ల కోసం సిద్ధంగా ఉం డండి!"
 
అఖిల్ అక్కినేని మాట్లాడుతూ.. ‘‘ఏజెంట్‌లో రికీ పాత్రను పోషించడం నాకు పరివర్తన కలిగించే అనుభవం. ఈ చలనచిత్రం భారీస్థాయి యాక్షన్, మనసుకు హత్తుకునే మలుపులు - అన్నింటినీ కలిగి ఉంది. ఆకర్షణీయమైన కథనం మీకు మరింత కావాలనే కోరికను కలిగిస్తుంది. సినిమా అంతటా కనిపించే మిస్టరీ అంశాలకు ప్రేక్షకులు ఫిదా అవుతారని నమ్ముతున్నాను. సోనీ లివ్‌లో ఏజెంట్ OTT ప్రీమియర్ కోసం నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను, వీక్షకులు తమ ఇళ్లలో నుండి దీన్ని ఆస్వాదించవచ్చు’’.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దక్షిణాది సెక్సీ తార సిల్క్ స్మిత గురించి కొన్ని విశేషాలు