Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Advertiesment
Akash Jagannath, Master Mahendran

చిత్రాసేన్

, శనివారం, 1 నవంబరు 2025 (17:06 IST)
Akash Jagannath, Master Mahendran
మాస్టర్ మహేంద్రన్ హీరోగా బేబీ చైత్ర శ్రీ బాదర్ల, మాస్టర్ యువ్వాంశ్ కృష్ణ బాదర్ల సమర్పణలో ధనలక్ష్మి బాదర్ల నిర్మాతగా వైకుంఠ్ బోను తెరకెక్కించిన చిత్రం వసుదేవసుతం. రెయిన్‌బో సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు, మోషన్ పోస్టర్, గ్లింప్స్, టీజర్‌ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి టైటిల్ సాంగ్‌ను హీరో ఆకాష్ జగన్నాథ్ రిలీజ్ చేశారు.
 
వసుదేవసుతం దేవం అంటూ సాగే ఈ  పాటను ఆకాష్ జగన్నాథ్ విడుదల చేశారు. చైతన్య ప్రసాద్ అందించిన సాహిత్యం, పవన్-శృతిక సముద్రాల  గాత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఇక మెలోడీ బ్రహ్మ మణిశర్మ మరో చార్ట్ బస్టర్ సాంగ్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. ఈ లిరికల్ వీడియోలో హీరో హీరోయిన్ జంట చూడముచ్చటగా ఉంది. ఊరి వాతావరణం, గుడిలో చిత్రీకరించిన ఈ పాట అందరినీ కట్టి పడేసేలా ఉంది. ఇక తెర అంతా కూడా కలర్ ఫుల్‌గా కనిపిస్తోంది. కొరియోగ్రాఫీ కూడా ఎంతో చక్కగా కుదిరినట్టు కనిపిస్తోంది.
 
పాటను రిలీజ్ చేసిన అనంతరం ఆకాష్ జగన్నాథ్ మాట్లాడుతూ..  వసుదేవసుతం దేవం అనే పాట చాలా బాగుంది. టీం అంతా వచ్చి నన్ను కలిసింది. ఈ పాటను నేను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. చైతన్య ప్రసాద్ గారి సాహిత్యం, మణిశర్మ గారి సంగీతం బాగుంది. మహేంద్రన్ అద్భుతమైన నటుడు. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. రిలీజ్ డేట్‌కు సంబంధించిన వివరాల్ని త్వరలోనే చిత్రయూనిట్ ప్రకటించనుంది.
 
తారాగణం: మాస్టర్ మహేంద్రన్, అంబికావాణి, జాన్ విజయ్, మిమ్‌గోపి, సురేష్‌చంద్ర మీనన్, ఈశ్వర్య లక్ష్మి, తులసి, రాజీవ్ కనకాల, టార్జన్, రామరాజు, బధ్రమ్, జబర్ధస్త్ రాంప్రసాద్, శివన్నారాయణ, దువ్వాసి మోహన్, సుమేత బజాజ్ తదితరులు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్