Publish Date: Tue, 02 Apr 2019 (14:52 IST)
Updated Date: Tue, 02 Apr 2019 (14:54 IST)
అజయ్... విలన్‌గానూ, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ విభిన్నమైన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన సంగతి అందరికీ తెలిసిందే. వివిధ సినిమాలలో కీలక పాత్రలు కూడా పోషించి తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ సాగిపోతున్న అజయ్... గతంలో ఒకటి రెండు సినిమాల్లో హీరోగానూ కనిపించినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. తాజాగా ఆయన 'స్పెషల్' సినిమాతో మరోమారు ప్రేక్షకుల ముందుకు హీరోగా రానున్నాడు. అజయ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్న ఈ సినిమాకి వాత్సవ్ దర్శకత్వం వహిస్తున్నారు.
కాగా... తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌లో, '93 డేస్ సస్పెన్షన్ తరువాత తిరిగి డ్యూటీలో జాయిన్ అయ్యాను. గత 7 రోజుల్లో నేను చూసిన విషయాలు ఏ పోలీస్ ఆఫీసర్ తన కెరియర్లో చూసుండడు" అంటూ అజయ్ చెప్పిన డైలాగ్ ఈ సినిమాపై ఆసక్తిని రేకెత్తించే విధంగా ఉంది. ఈ కథ పూర్తిగా ఒక కేసు విచారణకి సంబంధించిన నేపథ్యంలో సాగుతుందనే విషయం ఈ ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది.
త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో... హీరోగా ఈసారి అజయ్ ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి మరి.